మోడీ కోసం చంద్రబాబు చాణక్యం.. ఫలిస్తుందా?

భారతీయ జనతా పార్టీకి.. తెలుగుదేశం పార్టీకి బంధం అనేది 2018 లోనే తెగిపోయింది. ఇప్పుడు కొత్తగా దాన్ని అతికించడానికి జనసేనను వాడుతున్నారు. జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో, తాము ఉన్నామని అంటుంది గాని ఆ పార్టీ ని టిడిపి తో కలపలేక పోతుంది. అలా అని తానూ సొంతంగా రాలేక పోతుంది. 2018 - 19 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోడీ గురించి మాట్లాడుతూ దేశ నాయకుడుగా పని చేయడానికి మోడీ పనికిరాడని తీవ్రంగా దూషించారు. ఆయనను తిరిగి టీ అమ్ముకోవడానికి పంపించేద్దాం అని  దేశాన్ని వదిలి పంపించేద్దాం అని ఎద్దేవా చేశారు.

అలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు  తన ప్రసంగాల్లో ఇప్పుడు కొంత మాటల గారడీని వాడుతున్నారు. ఈ మధ్యన ప్రసంగాల్లో ఆయన మాట్లాడుతూ.. మా వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అని వ్యాఖ్యానించారు. ఇక్కడ " మావల్ల "అంటూ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలుపుకోవడానికి ప్రయత్నించారు. అంటే బిజెపి తనతో లేకపోయినా బిజెపితో మేము ఉన్నాం అని చెప్పడానికే ఇదంతా. రాజకీయాల్లో తన వయసు వారు ముఖ్యమంత్రులుగా చాలామంది ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన వయసు వాడేనని, నరేంద్ర మోడీని కలుపుకుంటూ పోవడం చూస్తుంటే విచిత్రంగా ఉంది.

ఏ పార్టీ అయినా, వైయస్సార్సీపీ కానీ కమ్యూనిస్టు పార్టీలు గాని చివరికి బిజెపి అయినా తమతో లేని పార్టీలను తమతో ఉన్నారని కలుపుకోదు. కానీ  చంద్రబాబు నాయుడు   డైరెక్ట్ గా తనతో లేని జనసేనను, ఇప్పుడు అసలు సంబంధమేలేని భారతీయ జనతా పార్టీని కూడా తమతోనే ఉన్నట్టుగా తన మాటల గారడీ ద్వారా చూపిస్తున్నారు. ఆ మాటల గారడిని కూడా ఒక అద్భుతంగా చూపిస్తుంది టిడిపి అనుకూల మీడియా. 2018-19 ప్రాంతంలో వేరు చేసుకున్న బీజేపీని ఇప్పుడు తిరిగి కలుపుకోవాలని చూస్తున్నారు. రాజకీయ నాయకులు, అందులోనూ చంద్రబాబు నాయుడు అవకాశం కోసం ఎన్ని మాటలైనా మారుస్తారనడానికి ఇదే సాక్ష్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: