ముందస్తుకు జగన్.. రెడీ అవుతున్న టీడీపీ?

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదని.. సంక్షేమ పథకాలు ఇవ్వలేక ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ నాయకులు శ్రేణులు అశ్రద్ధ చేయకుండా సిద్ధంగా ఉండాలని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపిద్దాం అని... చంద్రబాబును ఎప్పుడు సీఎం చేసుకుందామా అని ప్రజలంతా  ఎదురు చూస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజలందరూ అభద్రత భావంతో బతుకుతున్నారని.. ఈ పరిస్థితి కొంతమంది వైసీపీ వారిలో కూడా ఉందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని మరిచిపోయారని వసూళ్ల పర్వం తప్ప మరొకటి లేదని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇచ్చే పథకాలు నలుగురికి మాత్రమే అందుతున్నాయని.. అందుకే రాష్ట్ర మొత్తం ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు అంటున్నారు.

జగన్ ఇక తిరిగి రాకుండా ఎప్పుడు ఇంటికి పంపిద్దామని చూస్తున్నారన్న ప్రత్తిపాటి పుల్లారావు.. చిలకలూరిపేటలో ఉన్న మంత్రికి తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత లేదంటున్నారు.  ఈ మంత్రి ఈసారి చిలకలూరిపేటలో పోటీ చేస్తే కౌంటింగ్ కూడా అవసరం లేదన్న ప్రత్తిపాటి పుల్లారావు..  ఎంత మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వస్తుందో చూసుకోవడమే అన్నారు. కొత్త సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరూ కసిగా పనిచేసి 2023లో చంద్రబాబును సీఎం సీటులో కూర్చోబట్టే దాకా అలుపెరగని పోరాటం చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు ఇచ్చారు.

రాష్ట్రంలో సైకో పాలనకు ప్రజలు చరమ గీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రత్తిపాటి పుల్లారావు.. యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర అనగానే జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. రోజులు దగ్గరపడి జగన్ రెడ్డి పీఠం కదులుతుండడంతో వణుకు ప్రారంభమైందని.. లోకేష్ పాదయాత్ర లో యువత, మహిళలు, రైతుల గురించి ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని ముందుకు సాగడం జరుగుతుందని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: