జనవరి 1: ఉద్యోగులకు జగన్ న్యూ ఇయర్‌ షాక్‌?

ఒక 20-30 సంవత్సరాల క్రితమే యూరప్ లో  ఫేస్ రికగ్నైజేషన్ లేదా థంబ్ రికగ్నైషన్‌ వంటి టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలాంటి దేశాల్లో అయితే సంతకాలు , థంబ్ లు ఉండేవి కావు అప్పట్లోనే. ఫేస్ రికగ్నైజేషన్ లేదా థంబ్ చేసుకొని వర్క్ లోకి వెళ్ళిపోతూ ఉండేవారు.  మనం అప్పట్లో అవి అందుకోలేక కాదు, సంతకాలు పెట్టడంలో ఉన్న లొసుగులో, ఆ సౌకర్యానికి మనం అలవాటు పడిపోయాం. పేపర్ మీద అయితే మనం ఏది రాస్తే అదే ఉంటుంది.. టైం లు తేదీలతో సహా ఏదైనా మన ఇష్టం. కానీ ఈ పేస్ రికగ్నైజేషన్ లేదా థంబ్ అనే ప్రాసెస్ లో అది కచ్చితమైన, నిర్ణీతమైన నిజాన్ని చూపించేదిలా ఉంటుంది. ఎగ్జాక్ట్ టైమ్‌ ఎగ్జాక్ట్ డేట్ లతో సహా ఉంటుంది.

అయితే.. నూతన సంవత్సరం ఏపీలో 2023 నుంచి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తో పాటు మొత్తం సిస్టమ్స్ అన్ని మోడరైజేషన్ చేస్తూ కాగితాలు ఫైళ్ళతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ సిస్టం అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ- ఆఫీస్ సిస్టం అనే ఆలోచనకు పునాది ఆరు సంవత్సరాల క్రితమే పడినా  ఇప్పటివరకు అమలు కాలేదు. కానీ జనవరి ఒకటో తేదీ నుంచి ఏపీలో రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో  ఈ -ఆఫీస్ నుంచి కార్యకలాపాలు కొనసాగించాలని ఉత్తర ప్రత్యుత్తరాలు ,మెయిల్స్, తపస్ అన్నీ ఈ-ఆఫీస్ అధికారిక ఈమెయిల్స్ ద్వారానే జరగాలని  ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికి తగిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులును కూడా సి ఎస్ జారీ చేశారు.  మరి ఈ-ఆఫీస్ సిస్టం  లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే.. ఎక్కువగా ఇంటర్నెట్ కు సంబంధించిన సమస్యలు వస్తాయి.. ఇంకా పనిలో అలసత్వం చేయడానికి ఉండదు. మరి చూద్దాం ఇప్పుడైనా ఈ ఈ -ఆఫీస్ సిస్టం పక్కాగా పట్టాలెక్కుతుందో లేదో.. పక్కకు తప్పుకుంటుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: