వార్నీ.. ప్రధాని మోదీ యూట్యూబ్‌కు ఇంత డిమాండా?

మోదీ మరో రికార్డు సృష్టించారు. సోషల్ మీడియాను వాడుకోవడంతో ముందుడే మోడీ.. ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనం సృష్టించారు. సాధారణంగా మొదట్లో సైద్దాంతిక పార్టీలు అయిన కమ్యూనిస్టు పార్టీ ఇంకా భారతీయ జనతా పార్టీ తమ ప్రెస్ నోట్ ని కూడా తన చేతితోనే రాసి పంపించేవి. సిద్ధాంతాల పరంగా ఈ రెండు పార్టీలకి సంబంధం లేకపోయినప్పటికీ.. కమ్యూనిజం భావాలున్న కమ్యూనిస్టు పార్టీ ఇంకా ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన భారతీయ జనతా పార్టీల, పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చు విషయంలో..,ఖర్చు తగ్గించడం అనే విషయంలో వారిద్దరి వర్కింగ్ స్టైల్ మాత్రం ఒకేలా ఉండేది.

అందుకే వారు గతంలో తమ ప్రెస్ నోట్ ని కూడా నోట్ ప్యాడ్ పై రాసి  ఇచ్చేవారు. ఇప్పుడంటే ప్రింటింగ్లు ఇంకా రకరకాల టెక్నాలజీలు వచ్చాయి. మన ప్రధాని నరేంద్ర మోడీకి అయితే ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆయనకు సంబంధించిన సభలు, సమావేశాలు , మీటింగులు, ప్రసంగాలు వీటన్నిటికీ సంబంధించి ,ఇవన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్ లో లైవ్ వస్తూ ఉంటాయి.

ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ మంచి వైరల్ అయ్యి దానికి ప్రస్తుతం కోటి మందికి పైగా సబ్‌స్క్రయిబర్స్ వచ్చారు. దీనికి నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మోడీకి సంబంధించిన వార్తలన్నీ ప్రజలకు అంటే.. సబ్‌స్క్రయిబ్‌ చేసిన వారికి అందుతాయి. 136 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక కోటి మంది సబ్‌స్క్రయిబర్స్ వేగంగా రావడమే ఒక విశేషం అయితే.. ఒక రాజకీయ నాయకుడు, దేశ ప్రధానికి సంబంధించిన వార్తలను గురించి జనాలు ఆసక్తి చూపడం మరో విశేషం. అదీ రాజకీయ నాయకుల్లో మోడీకి ఉన్న డిమాండ్. మారుతున్న కాలంతో పాటే నాయకులు మారాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేస్తున్నారు. పాత తరం కొత్త తరం కలయికలాంటి మోదీ.. సకాలంలో డిజిటల్‌ యుగాన్ని అందిపుచ్చుకుంటున్నారు.. దాని ఫలితాలు అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: