కాశ్మీర్‌లో సీక్రెట్‌గా చైనా ఇంత పని చేస్తోందా?

ఇండియా-పాకిస్తాన్ అనేవి పరస్పర శత్రుదేశాలన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్ బాటలోనే చైనా కూడా ఇప్పుడు భారత్ పై కుట్రలు పన్నుతుంది. పాకిస్తాన్ కు సహాయం చేయడం ద్వారా చైనా ఇప్పుడు మన మీదకు కుట్రపూరితమైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుందన్న విషయం బట్టబయిలయ్యింది. శత్రువు మన మీదకి డైరెక్ట్ గా యుద్ధం చేయడం వేరు, అదే శత్రువును అడ్డుపెట్టుకొని మరో శత్రువు మన మీదకు కనపడకుండా దాడి చేయడం వేరు.

పాకిస్తాన్ కు మన మీద ఉన్న శత్రుత్వాన్ని ఇప్పుడు చైనా ఉపయోగించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంది. పాకిస్తాన్ తీవ్రవాదులకు ఆయుధాలు సమకూర్చడం ద్వారా చైనా మన మీదకు దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. తాజాగా ఒక అటవీ ప్రాంతంలో దొరికినటువంటి భారీ ఆయుధ డంపే దీనికి సాక్ష్యం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉన్న ఒక అటవీ ప్రాంతంలోని ఒక కొండలో దొరికినటువంటి భారీ ఆయుధ డంపును సైన్యం బయట పెట్టింది.

ఈ ఆయుధ డంప్ లో.. 24-ఏకే 47 రైఫిల్స్, 12-చైనీస్ పిస్టల్స్, చైనీస్ హ్యాండ్ గ్రనేడ్లు, 5 పాక్ తయారీ హ్యాండ్ గ్రనేడ్లు, 5వ పాక్ అని రాసి ఉన్న 81 బెలూన్లు, భారీగా మందు గుండు సామాగ్రి లభించాయి. చైనా వీటిని దొంగతనంగా పాక్ కు తరలించి.. మనతో అధర్మయుద్ధం చేయడానికి.. పాక్ ను ఉసిగొలుపుతూ సహాయపడుతుంది.పక్క దేశం మీద  ఉండే శత్రుత్వాన్ని బట్టి మనం ఒక దేశంలోని మనుషులను తీవ్రవాదులుగా మార్చట్లేదు. అది మన పద్ధతి కూడా కాదు ‌‌.

మరి చైనా భారత్ తో.. ఇలాంటి పరోక్ష యుద్ధం, అధర్మయుద్ధం.. చేస్తుంటే దానికి కారణం.. మనతో ముఖాముఖి ఢీకొట్టే ధైర్యం లేకపోవడమే కారణం కావచ్చు లేదా మరేదైనా కారణం కావచ్చు. కానీ పరాక్రమం లేని వాడే పరోక్ష యుద్ధం చేస్తాడు అన్న విషయం చైనా అర్థం చేసుకుని ప్రత్యక్ష యుద్ధానికి వేస్తే భారత్ దానికి దీటైన సమాధానం చెబుతుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: