ప్రేమ పుట్టించడం ఎలా? జపాన్‌కు వింత కష్టం?

ఇదివరకు బాల్య వివాహాలు జరిగేవి. క్రమంగా చదువుకునే రోజుల్లోనే పెళ్లిళ్లుచ చేయడం స్టార్ట్ చేశారు. కాలక్రమంగా పరిస్థితులు మారాయి. ఆడ, మగ అనే తేడాలు లేకుండా అందర్నీ సమానంగా చూస్తున్నారు. దీంతో ఆడపిల్లలంటేనే భారంగా చూసేవాళ్లు కూడా తగ్గిపోయారు. దీని పర్యావసానం.. ఆలస్యంగా పెళ్లిళ్లు అవుతున్నాయి. సొంత  కాళ్లపైనే నిల్చున్నాక పెళ్లి చేసుకుంటున్నామని యువత చెబుతోంది. పెళ్లిళ్లు ముప్పై, ముప్పై ఐదేళ్లల్లో జరుగుతున్నాయి. గతంలో పెళ్లి అనేది ఒక ప్రేమ బంధంగా ఉండేది. క్రమంగా అన్ని బంధఆలు ఆర్థికంగా ముడిపడ్డాయి. ఇలాంటి సిచ్యువేషన్ ని భారత్ లో ప్రస్తుతం చూస్తున్నాం.

కానీ జపాన్ లో ఇది ఎప్పుడో వచ్చింది. జపాన్ లో పెళ్లిళ్లు చేసుకోవడం ఎప్పుడో మానేశారు. దీంతో జనాభా తగ్గిపోయింది. అది ఎంతలా అంటే ప్రేమించుకోండని యాజమాన్యం సెలవులు ప్రకటించే స్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. గతంలో పిల్లల్ని కంటే 3 లక్షల 58 వేల యెన్స్ ఇస్తామని ప్రకటించింది. అయినా మార్పు పెద్దగా రాకపోడంతో.. పిల్లల్ని కంటే 4 లక్షల 20 వేల యెన్స్ ఇస్తామని ప్రకటిస్తామంది జపాన్ ప్రభుత్వం. పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రచారం చేస్తుంది. ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి వస్తే.. దానికి కూడా డబ్బులు ఇస్తామని అంటోంది. జనాభా పెంచడమే ధ్యేయంగా పెట్టుకుంది జపాన్.

ఎందుకంటే ప్రస్తుతం అక్కడ 29 శాతం మంది వృద్ధులు ఉన్నారు. క్రమంగా వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో జపాన్ లో యువత కనుమరుగయ్యే పరిస్థతి వచ్చే ఛాన్స్ ఏర్పడనుంది. అందుకే అలెర్ట్ అయిన జపాన్ ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేస్తుంది. మనుషుల్లో ప్రేమ పుట్టించడం ఎలా అనే దానిపై చర్చలు జరుపుతోంది. అలా అయినా పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటారని ఆశ పడుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరీ చర్చలు జరుపుతోంది అక్కడి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: