ఏపీకి వస్తే.. పవన్ వారాహి రంగు మారుతుందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వారాహి’ పేరుతో ఓ వాహనం కొత్తగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఈ వాహనాన్ని డిజైన్ చేయించారు. అయితే.. ఈ వాహనం రంగుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వారాహి వాహనాన్నికి వేసిన ఆలివ్ గ్రీన్ రంగు సైన్యం వాహనాలకు మాత్రమే వాడాలని మోటారు వాహనాల చట్టం చెబుతోందని.. మొదట్లో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.

అసలు ఆ వాహనం ఎక్కడా రిజిస్ట్రేషన్ కాదని.. అందుకే పవన్ కల్యాణ్.. ఎలాగూ ఆ వాహనం రంగు మార్చాల్సి వస్తుందని పేర్ని నాని చెప్పుకొచ్చారు. అందుకే ఏకంగా పసుపు రంగు వేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని పేర్ని నాని మొదట్లో అన్నారు. అయితే.. ఆ వారాహి వాహనాన్ని తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండానే వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ విషయాన్ని జనసేన ప్రకటించింది.

ఇప్పుడు ఈ అంశంపై ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌  స్పందించారు. వాహాహి వాహనంపై ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చెబుతున్నారు. అయితే.. ఈ వారాహి వాహనం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తామని  మంత్రి గుడివాడ అమర్నాథ్‌  అన్నారు. వారాహి వాహనం ఏపీకి వచ్చాక నిబంధనలకు అనుగుణంగా ఉంటే రవాణా శాఖ అనుమతి ఇస్తుందని  మంత్రి గుడివాడ అమర్నాథ్‌  చెప్పారు.

ఏపీ రవాణా శాఖ అనుమతిస్తే.. వారాహి వాహనం రాష్ట్రమంతా తిరగొచ్చని.. అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని  మంత్రి గుడివాడ అమర్నాథ్‌  అన్నారు. అయితే.. వారాహి ఏపీలోకి వచ్చాక ఏ రంగు వేసుకుంటుందో చూడాలని  మంత్రి గుడివాడ అమర్నాథ్‌  సెటైర్ వేశారు. ఎవరెక్కువ ప్యాకేజీ ఇస్తే  వారి రంగు వేస్తారేమో చూడాలి అంటూ  మంత్రి గుడివాడ అమర్నాథ్‌  కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: