బాబోయ్.. కోర్టుల్లో కేసులు.. ఇంత అన్యాయమా?

న్యాయం ఆలస్యమైతే.. న్యాయం దక్కనట్టే అనేది ఓ నానుడి. దీని ప్రకారం చూస్తే మన దేశంలో న్యాయం చాలామందికి ఎండమావే అవుతోంది. ఎందుకంటే.. దేశంలో ప్రస్తుతం నాలుగు కోట్ల 86 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర న్యాయ శాఖ పార్లమెంటుకు తెలిపింది. వీటిలో 69వేల 744 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. 58లక్షలకు పైగా కేసులు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలినవి క్రింది స్థాయిలో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ ఏడాది నవంబర్ 29 వరకు సుప్రీంకోర్టులో 69,744 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు సుప్రీంకోర్టు 29,109 కేసులను పరిష్కరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 14,94,201 కేసులు పరిష్కారమయ్యాయి.  జిల్లా కోర్టులు 1,76,24,307 కేసులను పరిష్కరించాయి. అక్టోబర్ 2022 వరకు సుప్రీంకోర్టులో 28,651 కొత్త పిటిషన్లు దాఖలయ్యాయి.  సెప్టెంబర్ 30 వరకు అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో 15,40,254 కొత్త పిటిషన్లు దాఖలైయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు జిల్లా కోర్టుల్లో 1,93,77,109 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఈనెల ఐదో తేదీ వరకు తెలంగాణ హైకోర్టులో 2,47,853 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో సివిల్‌ వివాదాలు 2,14,369. క్రిమినల్‌ కేసులు 33,484 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో... మొత్తం 2,33,788 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.  సివిల్‌ 1,99,318, క్రిమినల్‌ 34,470 పిటిషన్లు ఉన్నాయి. వివిధ హైకోర్టుల పరిధిలో ఉన్న క్రింది స్థాయి కోర్టుల్లో ఇంకా పరిష్కారం కాని కేసుల్లో... మొత్తం 4 కోట్ల 28 లక్షల 18వేల 111 ఉన్నాయి. సివిల్‌ 1 కోటి 9 లక్షల 35 వేల 794 కేసులు, క్రిమినల్‌ కేసులు 3 కోట్ల 18లక్షల 82వేల 317 కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పరిధిలో మొత్తం... 8,15,170 కేసులు ఉన్నాయి. వాటిలో 4,12,290 సివిల్‌ కేసులు, 4,02,880 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు పరిధిలో మొత్తం... 10 లక్షల 43వేల 906 కేసులు ఇంకా పరిష్కారం కావాల్సి ఉన్నాయి. వాటిలో... 4,19,915 సివిల్‌ కేసులు, 6,23,991 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

LAW

సంబంధిత వార్తలు: