చంద్రబాబు ఫ్రస్టేషన్‌ వెనుక.. అసలు కథ ఇదేనా?

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఊరికే ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. ఎప్పుడూ లేనిది రారా.. ఒరేయ్.. నా.. కొ..క.. అంటూ వల్గర్‌గా మాట్లాడుతున్నారు. అంతే కాదు.. ఇవే తన చివరి ఎన్నికలు అంటూ సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి చంద్రబాబు ఎందుకు ఇంతగా ఫీలవుతున్నారు. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు.. దీనివెనుక ఉన్న కథ ఏంటో..  మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ప్రతిప‌క్ష నేత‌ చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి మాటాడుతున్నారన్న మంత్రి బొత్స సత్యనారాయణ నోటికి ఏదొస్తే అది మాటాడుతున్నారన్నారు.

బాబు మాటలు నీచాతి నీచంగా ఉన్నాయని.. అతనే నిజాయితీ, సచ్చీలుడుగా మాటాడుతున్నారని.. చంద్రబాబు సభ్య సమాజం హర్షించని విధంగా మాటాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు సానుభూతి కోసం మాటాడుతున్నారని... తాను యోగి, మహా పురుషుడు , ఇతరులు దుర్మార్గులు అన్నట్టు మాటాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వైయ‌స్ఆర్‌ సిపి వెనుక జనం ఉన్నారని చంద్రబాబు అసహనానికి లోనవుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

చంద్రబాబుకు ఇంత వయస్సు వచ్చినా ఎందుకు సహనం కోల్పోతున్నారన్నారన్న మంత్రి బొత్స సత్యనారాయణ... మాకూ మాటలు వచ్చన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించబట్టే మాట్లాడ‌టం లేదని... ప్రతి చిన్న అంశాన్ని చంద్రబాబు రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబులా అబద్దాలు, ఫ్యాబ్రికేట్ చేస్తూ పబ్లిసిటి చేస్తూ మాటాడాల్సిన‌ పని తమకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

వచ్చే ఎన్నికలలో మనం చేసిన పనులు చెప్పుకుంటే చాలని.... భూ రికార్డుల సమస్య పాదయాత్రలో రైతులు వైయ‌స్ జగన్ దృష్టికి తీసుకువచ్చారని.. అందుకే అధికారం లోకి వచ్చాక భూ హక్కు కార్యక్రమం తీసుకువచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దేశం మెత్తం భూ హక్కు కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని... గ్రామకంఠాలు , ఎండోమెంట్, ఉమ్మడి కుటుంబాల భూ సమస్య లేకుండా చుసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: