చైనాలో రాజకీయ కుట్ర.. ఇండియాకు తలనొప్పి?

చైనాలో రాజకీయ కుట్ర జరిగిందని.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అరెస్టు చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే.. ఒకవేళ జిన్‌పింగ్‌ను పీఎల్‌ఏ అధిపతి హోదా నుంచి తొలగించి వేరేవారిని తీసుకువస్తే మన ఇండియాకు మరింత దెబ్బ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. నేరుగా సైనిక జోక్యంతో భారత్‌లోకి మరింత చొచ్చుకు రావాలని చైనా సైన్యం ఆలోచిస్తోంది.

అయితే.. ఇప్పటి వరకూ జిన్‌పింగ్‌ రాజకీయంగా ముందడుగు వేసేందుకు చూసేవాడు. ఏదైనా అంచెలంచెలుగా జరగాలని.. తొందరపడకూడదని జిన్‌పింగ్‌ భావించేవారు. అందుకే ప్రధాని మోదీ, ఆయన 18 సార్లు సమావేశం అయ్యారు. కానీ ఇప్పుడు జిన్‌పింగ్‌ను తొలగిస్తే కొత్తగా వచ్చే నాయకుడు మన ఇండియాను మరింతగా శత్రువులా చూసే ప్రమాదం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇంతవరకు మనకు ఎదురైన ఎదురు దెబ్బలు ఇకపై రెండింతలవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే.. చైనా కొత్త నాయకుడు సైన్యం ఆకాంక్షలకు అనుగుణంగానే స్పందించే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి వరకూ మనకు చైనా నుంచి ఉన్న ముప్పు.. ఇకపై  రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. ఏదేశానికైనా ప్రజా నాయకుడు కాకుండా సైన్యం నుంచి వచ్చినవారు అధ్యక్షుడైతే వారు యుద్ధాలవైపే మొగ్గుచూపుతారు. అందుకే చైనాలో సైన్యం నుంచి కొత్త నాయకుడు వస్తే మాత్రం ఇండియా యుద్ధానికి సిద్ధపడాల్సిన పరిస్థితి రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలు ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు దారి తీసింది.. జిన్‌పింగ్‌కు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే.. ఇటీవల చైనాలో అవినీతి, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలపై ఇద్దరు మాజీ మంత్రులకు, మరో మాజీ ఉన్నతాధికారికి మరణ శిక్ష విధించారు. అంతే కాకుండా ఇంకో నలుగురు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్షలు కూడా వేశారు. 2012లో పదవి చేపట్టిన జిన్‌పింగ్‌ అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు, రాజకీయ నేతలకు కఠినంగా శిక్షలు అమలు చేశారు. అవే ఇప్పుడు ఆయన కొంప ముంచినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: