అప్పటి నుంచే విశాఖ నుంచే పాలన.. ముహూర్తం ఫిక్స్‌?

ఏపీలో జగన్ సర్కారు తన రాజధానిగా విశాఖను నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కానీ.. అది అమలు చేయడంలో మాత్రం అడ్డంకులు వచ్చాయి. ఇక ఇప్పుడు విశాఖ కేంద్రంగా పాలన సాగించేందుకు జగన్ రెడీ అవుతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా కుదిరినట్టు తెలుస్తోంది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన జరుగుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. రాజధాని కోసం విశాఖలో ఒక సెంటు ప్రైవేట్‌ భూమి కూడా తీసుకోబోమని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌  చెప్పారు.

వైయస్‌ జగన్‌ ప్రభుత్వ వికేంద్రీకరణ పాలసీలో ఎలాంటి మార్పు లేదన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ధ్యేయమని తెలిపారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతి శాసన రాజధానిగా ఉంటాయని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని కూడా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.
 
పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్ర ఆర్ధిక వృద్ధి పై స్వల్పకాలిక జరిగిన చర్చలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఈ విషయాలు వెల్లడించారు. గడచిన 3 సంవత్సరాల్లో వచ్చిన పెట్టుబడులు.. భవిష్యత్తు లో జరిగే అభివృద్ధిని తెలియచేశాయంటున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. చంద్రబాబు ఈస్ అఫ్ సెల్లింగ్ బిజినెస్ లో నంబర్ ఒన్ అంటూ విమర్శించారు. రాష్ట్రానికి ఈ మూడేళ్లలో 60 వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. ఎంఎస్ఎంఈ ద్వారా రెండున్నర లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు.

బీచ్ ఐటి కాన్సెప్ట్ తో విశాఖ ను అభివృద్ది చేయడం తమ ప్రభుత్వ లక్ష్యం అని వివరించిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. 2023 ఫిబ్రవరి లో విశాఖ కేంద్రం గా ఇన్వెస్ట్మెంట్ మీట్ నిర్వహిస్తామన్నారు. పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధిలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా నిర్వహిస్తున్నామని.. విశాఖ నగరంలో  భూములు క్రయవిక్రయాలపై అక్రమాలు అని ఆరోపిస్తున్న టిడిపి వాటిని నిరూపించాలని సవాల్ చేశారు. అమరావతి రైతుల పాదయాత్రసలో ఏమి జరిగినా చంద్రబాబు బాధ్యత వహించాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖలో రాజధాని కి ఒక్క సెంటు కూడా ప్రైవేట్ భూమి  తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: