మునుగోడులో విజయం కోసం కాంగ్రెస్ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

ఎలాగైనా మునుగోడు స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందుకు వ్యూహాలు ఖరారు చేస్తోంది. బలగాలను మోహరిస్తోంది. ప్రతి రెండు గ్రామాలకు ఒక్కరు లెక్కన 150 మందిని పార్టీ నియమించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  తెలిపారు. ప్రతి పది గ్రామాలకు ఒకరు లెక్కన 30 మందిని పీసీసీ నియమించిందని.. ప్రతి మండలానికి ఇద్దరు లెక్కన 14 మందిని ప్రత్యేకంగా వ్యూహకర్తలుగా నియమించిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  అంటున్నారు. ప్రతి మండలానికి ఒక్కరు లెక్కన 7గురు సీనియర్లను పీసీసీ నియమించింది.

ఈ ఏడుగురిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.. మునుగోడు ఉపఎన్నిక పాల్వాయి స్రవంతి ఒక్కరిదే కాదు ....కాంగ్రెస్ పార్టీ దని నేతలు చెబుతున్నారు. 18 వ తేదీన ప్రచారం మొదలైతే చివరివరకు కొనసాగాలని.. బిజెపి మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చెయ్యాలని చూస్తుందని.. దాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ నేతలు పిలుపు ఇచ్చారు. స్థానిక నాయకులూ సమన్వయంతో పని చెయ్యాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ నాయకులతో చెప్పారు.

ఒక్కో బూత్ లో 254 ఓట్లు కాంగ్రెస్ కు  పోల్ అయ్యేలా చూసుకోవాలని.. బాధ్యతలు అప్పగించిన వారు ఎవరికి వారు ఆ దిశగా కృషి చేయాలని.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ అన్నారు. ఒక్కో బూత్ కు 254 ఓట్లు సాధిస్తే.. మొత్తం 76వేల ఓట్లు పొలవుతాయని.. ఇలా చేస్తే ఖచ్చితంగా మునుగోడులో కాంగ్రెస్ గెలుపు తథ్యమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ వివరించారు.

దుబ్బాక ఎన్నికల్లో మనం కేవలం 20 రోజుల ముందు ప్రచారంలోకి దిగామని.. కానీ మునుగోడులో 90 రోజుల ముందుగానే ప్రచార పర్వం మొదలు పెడుతున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ అన్నారు. 20 సెప్టెంబర్ లోగా బూత్ కమిటీ నియామకాలను పూర్తి చేసుకుని ప్రచారంలో దూసుకుపోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: