కేసీఆర్ ప్రధాని కలలు కంటున్నారా.. సాధ్యమా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా ప్రధాని కావాలని అనుకుంటున్నారా.. ఆ కలలు నిజమవుతాయా.. ఇప్పుడు ఈ అంశంపై బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ప్రధానమంత్రి అయిపోతానని కేసీఆర్ పిచ్చి కలలు కంటున్నారని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామి ఎద్దేవా చేస్తున్నారు. ఒంగోలులో పర్యటించిన ఆయన..  ఏపీ రాష్ట్రంలో బీజేపీనిబలోపేతం చేసే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగానే తాను జిల్లాకు వచ్చానని చెప్పారు.

అసలు కేసీఆర్‌కు ఎంత మంది ఎంపీలు ఉన్నారని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామి  ప్రశ్నించారు. ఆరేడుమంది ఎంపీలు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధాని కావాలనుకుంటే సాధ్యమవుతుందా అని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామి ఎద్దేవా చేసారు. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో సమస్యలు ఎలా పరిష్కరించాలి.. ఎలాంటి మంచి పనులు చేయాలి అని ఆలోచించాలని.. కానీ కేసీఆర్ రాష్ట్రాన్ని వదిలేసి.. పగటి కలలు కంటున్నారని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామి  విమర్శించారు.

జాతీయ పార్టీ పెడుతాను.. జాతీయ నాయకుడు అవుతాను అని కేసీఆర్ అనుకోవడం పిచ్చికలని, దాన్ని ఆయన వదిలేయాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామి  సూచించారు. ఒంగోలులోని ఓ ప్రైవేటు హోటల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాస్, ఇతర నాయకులతో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామి  సమావేశమై పార్టీ పరిస్థితి గురించి చర్చించారు.

ఆ తర్వాత ఒంగోలు కలెక్టరేట్లో దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ కార్యాక్రమాన్ని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామి  ప్రారంభించారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పోతుల సునీత, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: