అమరావతి: ఇది పాదయాత్రా.. దండయాత్రా?

అమరావతి రైతులు మరోసారి పాదయాత్ర బాట పట్టబోతున్నారు. ఈనెల 12 నుంచి అమరావతి నుంచి అరసవల్లి వరకూ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ యాత్రకు మొదట ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ.. పాదయాత్ర నిర్వాహుకులు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. నిరసన తెలపడం పౌరుల హక్కు కాబట్టి యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందేనని హైకోర్టు చెప్పింది. దీంతో యాత్ర ప్రారంభంకాబోతోంది. అయితే.. ఈ యాత్రపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఇది  ఉత్తరాంధ్రపై చంద్రబాబు చేయిస్తున్న దండయాత్ర అని వైసీపీ మంత్రులు వర్ణిస్తున్నారు.  అమరావతి రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈనెల 12న మహా పాదయాత్ర చేస్తామని చెబుతున్నారని.. ఇది తమ ప్రాంతానికి రాజధాని కావాలని చేస్తున్న యాత్ర కాదని వారు అంటున్నారు. ఇది ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు అని చేస్తున్నయాత్ర అంటున్న వైసీపీ మంత్రులు.. ఇది ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్న యాత్రగా వారు చెబుతున్నారు.

ఇది ఉత్తరాంధ్ర మీద చంద్రబాబు చేస్తున్న దండయాత్ర అంటున్న వైసీపీ మంత్రులు.. ఇది విశాఖపట్నానికి ఏమీ వద్దు అని చేస్తున్న యాత్ర అంటున్నారు. ఇది ప్రజలను రెచ్చగొట్టే యాత్ర అని.. ఇలాంటి యాత్రను ప్రజలు అడ్డుకుని  తీరతారని.. ఈ యాత్రపై ప్రజలు తిరగబడితే.. ఆ పరిణామాలకు చంద్రబాబుదే బాధ్యత అని వైసీపీ మంత్రులు హెచ్చరిస్తున్నారు. ఇది అమరావతిలో 29 గ్రామాలకు చెందిన యాత్ర తప్ప, రాజధానికి, రాష్ట్రానికి ఎలాంటి  సంబంధం లేదని వైసీపీ మంత్రులు అంటున్నారు.

అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదన్న మంత్రులు.. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండటానికి తాము వ్యతిరేకమన్నారు. అమరావతితోపాటు కర్నూలు న్యాయ రాజధానిగా, ఉత్తరాంధ్రలోని విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉండాలని తాము కోరుకుంటున్నామని వైసీపీ ఉత్తరాంధ్ర మంత్రులు తేల్చి చెబుతున్నారు. అదే తమ పార్టీ, తమ ప్రభుత్వం విధానమని తేల్చి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: