అక్టోబర్‌1: మహిళలకు జగన్‌ గుడ్‌ న్యూస్..?

అక్టోబర్ 1న జగన్ సర్కారు మహిళల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. రాజమండ్రిలో అక్టోబర్ 1న 'దసరా మహిళా సాధికారత ఉత్సవం' జరపబోతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం నినాదంతో నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  తెలిపారు.

ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  ప్రత్యేకంగా కలిసి ఈ విషయంపై చర్చించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల పోస్టర్ నమూనాను సీఎంకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అందించారు. ఆయన అసాంతం చదివి  మహిళా కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  తెలిపారు.

అంతే కాదు.. అక్కడే ఉన్న మహిళా మంత్రులను పిలిచి ఈ మహిళా ఉత్సవాన్ని విజయవంతం చేయాలని సీఎం జగన్ వారికి సూచించినట్టు.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  తెలిపారు. తర్వాత రాష్ట్ర మహిళా మంత్రులు ఆర్కే రోజా, విడుదల రజినీ, ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ లతో కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మహిళా సాధికారత ఉత్సవం పోస్టర్ రిలీజ్‌ చేశారు. సచివాలయ మీడియా పాయింట్ వద్ద  ఈ కార్యక్రమం నిర్వహించారు.

దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ ఒకటిన రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో  సాయంత్రం 4 గంటలకు ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  తెలిపారు. ఈ సందర్భంగా రెండువేల మందితో మహిళల బైక్ ర్యాలీ నిర్వహిస్తారట.  అలాగే నారీశక్తిని చాటే కళాజాత ప్రదర్శనలు ఉంటాయట. వీటితో పాటు మహిళ సాధికారత నృత్యరూపకాలు, వేషధారణలు, వీధినాటికలు, స్టేజీ షోలు ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారట. అంతే కాదు.. మహిళల కబడ్డీ, కర్రసాము, కరాటే, కోలాటం ప్రదర్శనలు, స్టాల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు కూడా ఉంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: