ఏపీ రాజధాని గురించి.. ఈ కఠోర నిజం మీకు తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏది.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇప్పుడు చాలా కష్టం.. ఎందుకంటే.. టెక్నికల్‌గా ఏపీకి ఇంకా రాజధాని హైదరాబాదే.. ఎందుకంటే పదేళ్ల కాలం ఉంది కాబట్టి.. అయితే.. ఏపీ విడిపోయాక ఏర్పాటు చేసుకున్న రాజధాని అమరావతి.. కాబట్టి ఏపీ రాజధాని అమరావతే అవుతుంది. కానీ.. జగన్ సర్కారు విశాఖను రాజధానిగా మార్చింది. అయితే.. ఆ ఉత్తర్వులు హైకోర్టు తీర్పు కారణంగా సస్పెండ్‌ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతే.

అయితే.. ఏపీ రాజధాని విషయంలో ఇలాంటి గందరగోళాలు కొత్త కాదు.. ఎందుకంటే.. అసలు ఏపీ ఉమ్మడి మద్రాసులో ఉన్నప్పుడు మద్రాసు తెలుగు ప్రాంతమే.. మద్రాసు మాకే కావాలని తెలుగు వారు అన్నా.. తమిళులు ఒప్పుకోలేదు. రాష్ట్రం కావాలనుకుంటున్నారు కాబట్టి ఆంధ్రులే మద్రాసును వదిలేసుకుని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డారు. ఆ సమయంలో ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు నిర్ణయించారు. కర్నూలులో గుడారాలు ఏర్పాటు చేసుకుని రాజధాని నడిపించారు కూడా.

అయితే.. ఆ తర్వాత కొన్నాళ్లకే తెలంగాణతో కలసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కారణంగా ఉమ్మడి ఏపీకి హైదరాబాద్ రాజధాని కావడం వల్ల.. ఆ సమస్య అలా పరిష్కారమైపోయింది. కానీ ఏపీ రాజధాని విషయంలో చాలామందికి తెలియని చరిత్ర ఉంది. అదేంటంటే.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు కూడా విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని రాకుండా అనేక ప్రయత్నాలు చేశారట. విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని రాకుండా నాడు కూడా విశాఖను రాజధాని చేయాలని కర్నూలు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారట.

నాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే విశాఖకు రాజధాని తరలివెళ్లాల్సి ఉండేదట. అప్పట్లో అసెంబ్లీలో చేరిన తీర్మానం ప్రకారం 1986లో విశాఖకు రాజధాని తరలివెళ్లాల్సి ఉండేదట. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్టు కందుల రమేశ్‌ వెల్లడించారు. ఆయన తాజాగా అమరావతి వివాదాలు, వాస్తవాలు పేరుతో ఓపుస్తకం రాశారు. ఆ పుస్తకావిష్కరణ సందర్భంగానే ఈ విషయం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: