మాధవ్ వీడియో టీడీపీ ఆఫీసులోనే ఎడిట్‌ అయ్యిందా?

గోరంట్ల మాధవ్‌ న్యూడ్ వీడియో కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ వీడియో విషయంలో కొందరు వైసీపీ నాయకులు కొన్ని లాజిక్‌లు లాగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని ఓ లాజిక్‌ విషయం బయటపెట్టారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పై బురద చల్లడం కోసం తమ పార్టీకి చెందిన ఒక ఎంపీ మీద ఒక వీడియో తయారు చేశార‌ని మాజీ మంత్రి కొడాలి నాని అంటున్నారు.   ఆ వీడియో టీడీపీ ఆఫీసులోనే ఎడిట్ చేశారేమో అంటున్న మాజీ మంత్రి కొడాలి నాని.. ఈ విషయంపై తమకు అనుమానం ఉందన్నారు.

గోరంట్ల మాధవ్ వీడియో చివరి వరకు మొత్తం చూస్తే.. రబ్‌ చేసినట్టు ఉందని.. కానీ.. టీడీపీ నేతలు మాత్రం తామేదో చూశామని చెబుతున్నారని.. మరి వీళ్లేం చూశారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. బహుశా దాన్ని లింక్‌ చేయడం కోసం ఎడిట్‌ చేసినప్పుడు టీడీపీ నేతలంతా చూసి ఉంటారని మాజీ మంత్రి కొడాలి నాని అనుమానం వ్యక్తం చేశారు. అందువల్ల దీని ఎడిటింగ్ టీడీపీ  పార్టీ ఆఫీసులోనే జరిగిందేమో అన్న అనుమానం వస్తోందని.. ఎడిటింగ్‌ సమయంలోనే టీడీపీ నేతలంతా ఆ వీడియోను చూశారేమోనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

జగన్ గారికి ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే నలుగురు కుట్రలు చేస్తున్నార‌ని మాజీ మంత్రి కొడాలి నాని మండిప‌డ్డారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, వారి ఇబ్బందులపై విపక్షం పోరాడాలని.. కానీ.. తెలుగుదేశం ఆ పని చేయడటం లేదని.. అందుకే ఆ పార్టీకి కనీసం ప్రతిపక్షం హోదా కూడా వస్తుందా? రాదా? అన్న అనుమానం ఉందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

సీఎం జగన్ పై.. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు నిత్యం కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ, ఏది జరిగినా వాటిని జగన్‌కి వీరు ఆపాదిస్తున్నారని.. ప్రతి అంశాన్ని జగన్‌పై నెట్టడం వీరికి ఆనవాయితీగా మారిందని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: