ఆ విషయంలో జగన్‌కు గుదిబండ కానుందా?

కేంద్రం నుంచి సకాలంలో నిధులు రావాటంటే.. కేంద్రం చెప్పిన కొన్ని సంస్కరణలు అమలుచేయాలి.. విద్యుత్ సంస్కరణల అంశం అలాంటిదే.. ఉచిత విద్యుత్ వంటి పథకాలకు కేంద్రం సహజంగానే వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగించాలని కేంద్రం కండిషన్  పెట్టింది. కేంద్రం నిధుల కోసం ఏపీ సర్కారు కూడా అందుకు ఓకే చెబుతోంది. కాకపోతే.. విద్యుత్ రాయితీ మాత్రం తామే భరిస్తామని ఏపీ చెబుతోంది.

కానీ.. ఒకసారి మీటర్ అంటూ పెడితే.. ఎప్పుడైనా రాయితీలు ఎత్తేస్తారని రైతులు భయపడుతున్నారు. అందుకే వారిని ఒప్పించడం జగన్ సర్కారుకు కత్తి మీద సాముగా మారింది. వ్యవసాయ మెటార్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించి చెప్పాలంటున్న సీఎం జగన్.. ప్రయోజనాలు వివరిస్తూ రైతులకు లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు. మీటర్ల వల్ల  రైతుపై ఒక్కపైసాకూడా భారంపడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని రైతులకు వివరించాలి సీఎం జగన్ సూచిస్తున్నారు.

ఇప్పటికే శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ ఎలా విజయవంతం అయ్యిందో వివరించాలంటున్న సీఎం జగన్.. రైతులకు జరిగిన మేలు కూడా వివరించాలన్నారు.  33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అక్కడ ఆదా అయిన విషయాన్ని రైతులకు వివరించాలంటున్న సీఎం జగన్.. మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవవి.. ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని.. దీని వల్ల నాణ్యంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందనే విషయాన్ని  రైతులకు వివరించాలని అంటున్నారు.

వ్యవసాయ పంపుసెట్లకోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేయాలని ఆదేశించిన సీఎం జగన్.. ఎక్కడ ట్రాన్సాఫార్మర్‌ పాడైనా వెంటనే మార్చాలని ఆదేశించారు. మరి సీఎం జగన్ చెబుతున్న ఈ విషయాలు ఆచరణలో సాధ్యమేనా.. అన్నది ఆలోచించాల్సిన విషయమే. కానీ.. రైతులను ఒప్పించి.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీని భరించగలిగితే.. మోటార్లకు మీటర్లు ఆహ్వానించతగిన వ్యవహారమే. రైతులకు వివరించి చెప్పడంలోనే విజయం దాగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: