జయహో: ప్రపంచాన్ని ఏలుతున్న భారత బిడ్డలు వీళ్లే?

ఇండియా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం. అయితే.. ఇండియన్లు చాలా దేశాలకు వలస వెళ్లారు. వలసలు వెళ్లిన చోట తమ ప్రతిభతో మంచి స్థానాలు సంపాదించారు. ఇప్పటి వరకూ ఎన్నారైలు అంటే బాగా సంపాదించుకుంటారు అన్న పేరు ఉంది. అయితే.. కేవలం డబ్బు సంపాదనే కాదు. తాము వెళ్లిన ప్రాంతాల్లో రాజకీయంగానూ దూసుకుపోతున్నారు. భారత సంతతికి చెందిన అనేక వారు.. అనేక దేశాల్లో కీలకపదవుల్లో కొనసాగుతున్నారు.

తాజాగా రిషి సునక్ బ్రిటన్ ప్రధాని రేసులో అందరికంటే ముందున్నారు. ఆయన బ్రిటన్ ప్రధాని అయితే.. అది ఎన్నారైల చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం అవుతుంది. రిషి సునాక్‌ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైతే.. భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరో దేశం బ్రిటన్‌ అవుతుంది. ఇప్పటికే ఐదు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వారు ఉన్నారు. మరి వారు ఎవరో తెలుసుకుందామా?

వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది కమలా హ్యారిస్‌.. ఈమె అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. : భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తులసేంద్రిపురానికి చెందిన వారు అన్న సంగతి తెలిసిందే.. కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఇక పోర్చుగల్‌ ప్రధానమంత్రిగా ఉన్న ఆంటోనియా కోస్టా మన మన గోవా మూలాలున్న వ్యక్తి. ఆంటోనియో కోస్టా తండ్రి ఆర్నాల్డో డా కోస్టా మన గోవా కుంటుంబానికి చెందిన వ్యక్తి.

ఇక గయానా అధ్యక్షుడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌ కూడా భారతీయ సంతతి వ్యక్తే.. ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌.. రెండేళ్ల క్రితం గయానా అధ్యక్షుడు అయ్యారు. మరో కీలక వ్యక్తి ప్రవింద్‌ జుగ్నాథ్‌.. ఈయన మారిషస్‌ ప్రధానమంత్రి.. ప్రవింద్‌ జుగ్నాథ్‌ మారిషస్‌ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రవింద్‌ జుగ్నాథ్‌ కూడా భారత మూలాలున్న హిందూ కుటుంబానికి చెందిన వారే. మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ కూడా భారత ఆర్య సమాజ్‌ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తే. ఆ దేశంలో పలుమార్లు ఎంపీ అయిన ఆయన.. 2019లో మారిషస్‌ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. సురినామ్‌ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్‌ సంతోఖి కూడా మనోడే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: