వారెవా.. మనోడే బ్రిటన్ ప్రధాని.. ఖాయం?

భారతీయులకు ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రుషి సునక్‌ ఎన్నిక కాబోతున్నారు. ఇక అతడి ఎన్నిక లాంఛనమే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. బ్రిటన్ ప్రధాని ఎంపిక రేసులో సునక్ దూసుకుపోతున్నారు. అతనికి ప్రత్యర్థులకు మధ్య చాలా దూరం ఉండిపోయింది. ఏవైనా అద్భుతాలు, అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప..  రుషి సునక్‌  విజయాన్ని ఎవరూ ఆపలేరు.

ఎందుకంటే.. కన్జర్వేటివ్‌ పార్టీ నిర్వహించిన రెండో విడత ఎన్నికల్లో రుషి సునక్‌ 101 ఓట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. రెండో దశ ఎన్నిక తర్వాత పోటీలో అయిదుగురు అభ్యర్థులు నిలిచారు. సునక్ తర్వాత వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాండ్ 83 ఓట్లుతో రెండో స్థానంలో ఉన్నరాు.  ఆ తర్వాత  వాణిజ్య మంత్రి లిజ్‌ ట్రూస్‌ కు 64 ఓట్లు వచ్చాయి. ఇక మరో మాజీ మంత్రి కెమీ బడెనోచ్‌ కు 49 ఓట్లు మాత్రమే రాగా..మరో మంత్రి టామ్‌ టుగెంధత్‌కు 32 ఓట్లు వచ్చాయి.

ప్రధాని పదవి రేసులో ఉన్న మరో భారత సంతతి వ్యక్తి సుయెలా బ్రావెర్మన్ మాతర్ం కేవలం 27 ఓట్లు మాత్రమే సాధించడంతో ఆమె ఔట్ అయ్యింది. ప్రధాని పదవి రేసు నుంచి సుయెలా బ్రావెర్మన్ వైదొలగింది. ఇక తొలి 2రౌండ్ల  తరహాలోనే వివిధ రౌండ్లు నిర్వహించి ప్రధాని పదవి రేసు విజేతను నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఈ నెల 21 వరకూ జరుగుతుంది. అనేక రౌండ్ల తర్వాత ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రధాని రేసులో మిగిలేలా చేస్తారు.

చివరకు అలా మిగిలిన ఇద్దరిలో ఒకరిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకుంటారు. అయితే.. ఈ ఎన్నిక ప్రక్రియలో లక్షా 60 వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు కన్జర్వేటివ్‌ పార్టీ నేతకు ఓటు వేస్తారు.  సెప్టెంబర్ 5న తుది ఎన్నిక ఉంటుంది. ఈ పార్టీ అధినేతగా ఎన్నికైన వారే బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపడతారు. అంటే.. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన లక్షా 60వేల మందిలో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తి బ్రిటన్‌ ప్రధాని పగ్గాలు చేపడతారన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో మన ఇండియన్ ఆరిజన్ రుషి సునక్‌ చాలా ముందంజలో ఉన్నారు. ఆయన బ్రిటన్ ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: