వైసీపీ ఎమ్మెల్యేల మెడపై వేలాడుతున్న జగన్‌ కత్తి?

ఏపీ సీఎం జగన్ ఎన్నికల మోడ్‌లోకి వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు సీరియస్‌గా చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలకు కూడా అర్థమయ్యేలా చెప్పేశారు. 8 నెలల్లో పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తల భవిష్యత్తు ఏంటో తేలిపోతుందనే సంకేతాలు ఇచ్చేశారు. గడప గడప కార్యక్రమంలో నేతలు  ఎలా పాల్గొంటున్నారనే  దానిపై నియోజక వర్గాల వారీగా రూపొందుతున్న నివేదికలే వారి తలరాతను నిర్ణయించబోతున్నాయి.

ఈ నివేదికలో ఎమ్మెల్యేలు, నేతల పనితీరు, ప్రగతి ఆధారంగా వారి భవిష్యత్తు ను సీఎం జగన్ నిర్ణయించబోతున్నారు. 8 నెలల్లో ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తల భవిష్యత్తు తేలిపోబోతోందని ఈ కార్యక్రమానికి హాజరైన నేతలు చెప్పుకుంటున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల సమస్యలను సావధానంగా విని  పరిష్కరించాలని సీఎం నేతలకు ఆదేశించారు. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవాలని సీఎం ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు వివరించాలని సీఎం ఆదేశించారు.

గ్రామాల్లో  వార్డుల్లో జరిగిన అభివృద్దిని వివరించాలని సీఎం నేతలను ఆదేశించారు. ప్రభుత్వం, ప్రజలను  వాలంటీర్ల ద్వారా  అనుసంధానం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు నమోదు చేసి వేగంగా  పరిష్కరించాలని సీఎం సూచించారు. అంతే కాదు.. రాబోయే రోజుల్లో మరింత  విస్తృతంగా జనంలో తిరగాలని సీఎం జగన్న నేతలకు  సూచించారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేతలు ఎలా పాల్గొంటున్నారు. వారికి జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో నివేదికల్లో తేలిపోతుంది. వారి పనితీరును బట్టే వచ్చే ఎన్నికల్లో నేతలకు సీట్లు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ నేతలకు తేల్చి చెప్పారు. పని చేయని నేతల కోసం పార్టీని పణంగా పెట్టలేనని సీఎం జగన్ మోహమాటం లేకుండా స్పష్టం చేసేశారు. పనితీరు మారకపోతే నేతలకు భవిష్యత్తు ఉండదని జగన్ తేల్చి చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: