జగన్‌ ప్లాన్‌ అట్టర్‌ ఫ్లాప్‌.. తేల్చేసిన ఉండవల్లి?

ఏపీ సీఎం జగన్ సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు. తాను ఎన్నికల ముందు చెప్పిన నవరత్నాల అమలుపైనే ఆయన ఎక్కువగా ఫోకస్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే.. తనకు ఓట్లు వేసే వారికి ఏదొకటి పంచాలనే విధానంతో జగన్ ముందుకు‌ వెళుతున్నారని ప్రముఖ నేత, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే.. ఈ విధానం ప్రపంచంలో  ఎక్కడా విజయం కాలేదని గుర్తు చేశారు. అంటే జగన్ వ్యూహం అట్టర్ ఫ్లాప్ ఖాయమని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు.

చంద్రబాబు హయాంలో జగన్ ఎలా మాట్లాడారో... ఇప్పుడు జగన్ హయాంలో చంద్రబాబు అలాగే మాట్లాడుతున్నారని ఉండవల్లి కామెంట్ చేశారు. ముఖ్యమంత్రులు మారినా ఏపీ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  దేశంలోని పరిణామాలను చూస్తుంటే ఆందోళన కలుగుతోందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొచ్చి వివాదం చేయవద్దని ఉండవల్లి విజ్ఞప్తి చేశారు. చదువుకున్న వాళ్లు కూడా సంకుచితంగా ఆలోచన చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర పార్టీల్లో పదవులు అనుభవించిన వాళ్లు కూడా బీజేపీ భావజాలం తెలియకుండా అక్కడ కూడా పదవులు కోసమే వెళ్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్‌  విశ్లేషించారు. వైసీపీ, టీడీపీ, జనసేన బీజేపీకే మద్దతు ఇస్తున్నాయని.. అన్ని రంగాల్లో విఫలమైన భాజపా...మతం విషయంలో మాత్రం విజయం సాధించిందని ఉండవల్లి అరుణ్ కుమార్‌  అంటున్నారు. 2017 లోనే డయా ఫ్రం వాల్  పోయిందని తాను చెప్పానని ఉండవల్లి గుర్తు చేశారు. పోలవరం కింద 30 వేల కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని ఉండవల్లి అరుణ్ కుమార్‌ వ్యాఖ్యానించారు. కోట్లు ఇవ్వాల్సి వస్తుందనే పోలవరం నిర్మాణానికి కేంద్రం ఆసక్తి చూపడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్‌  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: