సీఎం జగన్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే?

ఏపీ మంత్రి వర్గ సమావేశంలో తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ ను ముందుగానే ప్రారంభించనున్నారు. జూన్ 1 నుంచి గోదావరి డెల్టాకు.. జూన్ 16 నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయబోతున్నారు. అలాగే.. ఎగుమతుల ప్రోత్సాహక విధానం 2022-27 సంవత్సరాలకు సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. 2022-27 ఏపీ లాజిస్టిక్ పాలసీ, ప్రోత్సాహకాలను కూడా ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

అలాగే నెల్లూరు జిల్లా సర్వే పల్లిలో క్రిబ్ కో సంస్థ ద్వారా బయో ఇథనాల్ తయారీకి ఏపీ మంత్రి మండలి  ఆమోదం తెలిపింది. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కోసం  1600 కోట్ల రుణ సమీకరణకు ఏపీ మంత్రి మండలి  ఆమోదం తెలిపింది. ప్రతీ జిల్లా కేంద్రం, కార్పోరేషన్ లో అత్యాధునిక వైద్య సౌకర్యాల కోసం మెడి కల్ హబ్ ల ఏర్పాటుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
 
ఇక ప్రవేటు రంగంలో వచ్చే పెట్టుబడులు కూడా కనీసం వంద పడకలు ఉండేలా ఆస్పత్రుల నిర్మాణానికి ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, కొత్తూరు, కడప జిల్లాల్లో తదితర చోట్ల అత్యాధునిక ఆస్పత్రుల నిర్మాణం కోసం భూములు  కేటాయించాలని ఏపీ మంత్రి మండలి నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలో టెక్స్ టైల్ పార్కు కోసం భూ కేటాయింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో రైతుల స్వాధీనంలో భూములకు హక్కులించేందుకు ఏపీ మంత్రి మండలి  ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లు బోయిన వేణు గోపాల కృష్ణ తెలిపారు. వీటిలో చాలా వరకూ జగన్ సాహసంతో నిర్ణయాలు తీసుకున్నారని  మంత్రి చెల్లు బోయిన వేణు గోపాల కృష్ణ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: