రష్యా ప్రకటనతో మూడో ప్రపంచ యుద్ధం భయం?

రష్యా.. తాము అణ్వస్త్ర సామర్థ్యం గల క్షిపణి దాడులపై సాధన చేస్తోన్నట్లు స్వయంగా వెల్లడించడం ప్రపంచాన్ని ఆందోళనలో పడేస‌తోంది. 100 మందికిపైగా వ్యూహాత్మక దళాలతో అణ్వాయుధాల వాడకంపై కసరత్తు చేసినట్టు రష్యా ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక అణ్వయుధ నిల్వలున్న దేశాల్లో రష్యా ఈ ప్రకటన చేయడంతో యుద్ధ భయాన్ని రెట్టింపవుతోంది. రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌లో తమ దళాలు అణు క్షిపణి దాడుల ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.

ఈ మాక్‌ డ్రిల్‌లో 100 మందికి పైగా... రష్యా వ్యూహాత్మక దళాలు పాల్గొన్నాయి. లక్ష్యాలను ధ్వంసం చేయడంలో ఈ బృందం విజయం సాధించిందట. ఉక్రెయిన్‌ పై యుద్ధం ప్రారంభించిన రోజు నుంచే రష్యా అణు దాడులపై దృష్టి పెట్టింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పశ్చిమ దేశాలు నేరుగా జోక్యం చేసుకుంటే ప్రతిదాడి తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే రష్యా అనేక సార్లు హెచ్చరించింది.  ఇప్పుడు ఏకంగా అణు దాడులకు సన్నాహాలు చేస్తుండటంతో ఇక మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే అనుమానం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం ప్రపంచంలోని 9 దేశాల దగ్గర దాదాపు 12,700 అణు క్షిపణులు ఉన్నాయి. వీటిలో అత్యధిక క్షిపణులు రష్యా దగ్గరే ఉన్నాయి. రష్యా తరువాత అణు క్షిపణులు కలిగి ఉన్న దేశాల్లో అమెరికాది రెండో స్థానం. రష్యా, అమెరికా వద్ద  సుమారు 10వేల అణ్వాయుధాలు ఉన్నట్లు గతంలో ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్‌ నివేదిక తెలిపింది. రష్యా దగ్గర 5977 క్షిపణులు ఉంటే.. అమెరికా దగ్గర  5428 అణు క్షిపణులు, చైనా దగ్గర 350 అణు క్షిపణులు, ఫ్రాన్స్ దగ్గర 290 అణు క్షిపణులు, బ్రిటన్ దగ్గర  225అణు క్షిపణులు, పాకిస్తాన్ దగ్గర  165 అణు క్షిపణులు, భారత్ దగ్గర 160 అణు క్షిపణులు, ఇజ్రాయెల్ దగ్గర 90అణు క్షిపణులు, ఉత్తర కొరియా దగ్గర 20 అణు క్షిపణులను ఉన్నట్టు అంచనా.

మరి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక అణ్వయుధ నిల్వలు ఉన్న రష్యా నుంచి అణు దాడి హెచ్చరికలు రావడం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ పరిణామాం ఎటు దారి తీస్తుందో అన్న ఆందోళన కలుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: