వడ్ల సమస్యకు కేసీఆర్‌ సర్కార్ కొత్త పరిష్కారం?

తెలంగాణలో వడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఈ వడ్లు కేంద్రం కొనాల్సిందే అని తెలంగాణ కోరుతుంది. కేంద్రం మాత్రం రాష్ట్రమే కొనాలంటోంది. ఈ అంశంపై చాలా గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మొత్తం ధాన్యం కొనేందుకు టీఆర్ఎస్‌ సర్కారు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది కేసీఆర్ సర్కారు. వడ్లను కొనుగోలు చేసే సమయంలో టెస్ట్ మిల్లింగ్ చేయించాలని నిర్ణయించారు.

అంటే వడ్లను మిల్లు పట్టిస్తే ఎంత శాతం నూక వస్తుందో తెలుసుకునే ప్రయత్నం అన్నాట. ఈ టెస్ట్ మిల్లింగ్ను ప్రాంతాల వారీగా చేసి ఔటర్న్ నిర్ణయించాలని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్.. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. మిల్లర్లను దొంగలుగా చూడడం బాధిస్తుందన్న గంగుల కమలాకర్.. రైతులు, మిల్లర్లు ఒకరికొకరుగా పనిచేస్తామని తెలిపారు.

దీనిపై స్పందించిన రైస్ మిల్లర్లు.. ప్రభుత్వానికి సహకరిస్తామని.. లాభాలు రాకున్నా నష్టం లేకుండా చూడాలని కోరుతున్నామని చెబుతున్నారు. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ పౌర సరఫరాల భవన్‌లో యాసంగి ధాన్యం సేకరణపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్  అనిల్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ జీఎంలు, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యులు, పెద్ద ఎత్తున మిల్లర్లు పాల్గొన్నారు.

రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, మిల్లర్ల పనితీరుపై ఈ సమీక్షలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ చర్చలు సఫలమయ్యాయి.  ధాన్యం ఆన్‌లొడింగ్‌కు మిల్లర్లు అంగీకరించినట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కేంద్రం నిరాకరించినా సీఎం కేసీఆర్ రైతుల తరుపున ధాన్యం కొంటున్నారని గంగుల కమలాకర్ చెబుతున్నారు. యాసంగి ధాన్యం సేకరణలో మిల్లర్లు బాగస్వామ్యం కావాలని.. రైతులకు, మిల్లులకు సంబంధం ఉండకూడదని.. ఒక్క కిలో తరుగు పెట్టడానికి వీలులేదని మంత్రి గంగుల కమలాకర్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: