జగన్ కొత్త కేబినెట్‌: ఆ జిల్లాలకు జాక్‌పాట్‌ ఛాన్స్?

ఏపీ సీఎం జగన్ కొత్త కేబినెట్‌లో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా ముగ్గురికి  మంత్రి పదవులు వచ్చాయి. చిత్తూరు జిల్లా నుంచే  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఆర్కే రోజాలకు మంత్రి పదవి దక్కింది. ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు. వారికి కొనసాగింపు అవకాశం దక్కింది. కొత్తగా ఆర్కే రోజాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే.. జగన్ కొత్త కేబినెట్‌లో మరికొన్ని జిల్లాలకు ఇద్దరు చొప్పు మంత్రుల అవకాశం వచ్చింది.

కొన్ని కొత్త జిల్లాలకు ఒకటి కన్నా ఎక్కువ  మంత్రి పదవులు దక్కడం విశేషం. శ్రీకాకుళం  జిల్లాకు రెండు మంత్రి పదవులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా నుంచే ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజుకు అవకాశం వచ్చింది. ఇందులో సీదిరి అప్పలరాజు ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఆయనకు కొసాగింపు లభించింది. అలాగే కోనసీమ జిల్లాకు  రెండు మంత్రి పదవులు  వచ్చాయి. కోనసీమ నుంచి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, పినిపె విశ్వరూప్ కు  ఇక్కడ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. విశేషంగా ఏంటంటే.. వీరిద్దరూ ఇప్పటికే కేబినెట్ లో ఉన్నారు. వీరిద్దరికీ కొనసాగింపు ఛాన్స్ వచ్చింది.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా  రెండు మంత్రి పదవులు వచ్చాయి. కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ ఈసారి అవకాశం లభించింది. కొత్తగా ఏర్పాడిన పల్నాడు జిల్లాకు  రెండు మంత్రి పదవులు వచ్చాయి. పల్నాడు జిల్లానుంచే అంబటి రాంబాబు, విడదల రజని కి అమాత్య పదవులు వచ్చాయి. వీరిద్దరికీ ఫస్ట్ టైమ్‌ అవకాశమే కావడం విశేషం.  ఇక జగన్ కొత్త టీమ్‌లో అసలు ఎనిమిది జిల్లాలలకు అసలు ప్రాతినిథ్యం లభించలేదు. ఉన్న జిల్లాల్లో పలువురు మంత్రులు ఉండటంతో జిల్లాకో మంత్రి పదవి  అనే విధానం అమలు చేయలేకపోయారు.

ఏపీలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ వాళ్లు ముందు ఆనందంతో పొంగిపోయారు. జిల్లాల విభజన తర్వాత కేబినెట్ కొలువుదీరుతుంటడంతో జిల్లాకో మంత్రి ఉంటారని ఊహించారు. కానీ ఆ అవకాశం మాత్రం దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: