బిపిన్ రావత్ సేవలకు వెలకట్టే షరాబు లేడు


యావత్ భారతావనికి అతి పెద్ద విషాద వార్త ఇది. భారతదేశపు మొట్టమోదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా నియమితులైన వ్యక్తి  జనరల్ బిపిన్ రావత్‌ . తమిళనాడు లోని వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ కళాశాలలో పాఠం చెప్పేందుకు వెళుతూ ఆయన మార్గ మధ్యలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఇంతకీ ఆయన భారత్ కు ఎం చేశారు ?
భారతదేశపు మొట్టమోదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా నియమితులైన వ్యక్తి  జనరల్ బిపిన్ రావత్‌ . ఈ యన నియామకం 2019లో జరిగింది. భారత సైన్యం లోని త్రివిధ దళాలను అంటే.. నావికా దళం, వైమానిక దళం,పదాతి దళాం. ఈ మూడింటి మధ్య సమన్వయాన్ని మరింత  మెరుగుపరిచడంతో పాటు, సైన్యాన్ని అప్రతిహతమైన రీతిలో  పటిష్టం చేయడం సీడీఎస్ బాధ్యత, విధి. అదే ఆయన లక్ష్యం
సీడీఎస్‌గా జనరల్ గా  బిపిన్ రావత్‌ను నియమిస్తూ  ప్రధానమంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ నేతృత్వం లోని  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు 2019, డిసెంబర్ 31నుంచే అమల్లోకి వచ్చాయి.సీడీఎస్ పదవిలో ఆయన మూడేళ్లు కొనసాగుతారని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కోంటున్నాయి. త్రివిధ దళాల అధిపతుల పదవీవిరమణ వయసు 62 ఏళ్లు కాగా, సీడీఎస్ పదవీవిరమణ వయసు 65 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ణయించిది.
 ఈ నియామకం రావడానికి దాదాపు  మూడు వసంతాల క్రితమే జనరల్ రావత్ సైన్యాధిపతి పదవి చేపట్టారు. పాకిస్తాన్, చైనా సరిహద్దులతో పాటు, ఈశాన్య ప్రాంతంలోని సరిహద్దులకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించారు.
సిడిఎస్ గా ఆయన చేసిన సేవలు వెలకట్ట లేనివి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సిడిఎస్ అంటే
రక్షణ మంత్రికి ముఖ్య సైనిక సలహాదారు. ఈ హోదాలో త్రివిధ దళాలకు సంబంధించిన వ్యవహారాలు ఆయన పరిధిలో  చేరాయి. డిఫెన్స్ అక్విజిషేన్ కౌన్సిల్ (డీఏసీ), డిఫెన్స్ ప్లానింగ్ కమిషన్ (డీపీసీ) లాంటి కీలకమైన రక్షణ శాఖ సంస్థల్లో ఆయనకు చోటు  దక్కింది. దీంతోఆయన అన్ని విభాగాలలోనూ తనదైన పనితీరు కనబరిచారు. రక్షణ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ (డీఎంఏ)కు కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. రక్షణ శాఖలో ఇది అయిదో విభాగం. అన్నింటికన్నా కొత్తది కూడా.
సైనికపరమైన కొనుగోళ్లు, శిక్షణ, ఖాళీల భర్తీకి సంబంధించిన బాధ్యతలు బిపిన్ రావత్ సమర్థవంతంగా నిర్వర్తించారు.  మౌలిక వసతుల కల్పన, వాటి వినియోగం కూడా మెరుగ్గా జరిగేలా చర్యలు తీసుకుని అందరి మన్ననలుపొందారు. తన పదవీ కాలంలో రావత్ 'జాయింట్/థియేటర్ కమాండ్'ను వ్యవస్థను ఏర్పాటు చేశారు. సైనిక కమాండ్ల పునర్వ్యవస్థీకరణ కోసం  కృషి చేశారు.
అండమాన్ నికోబార్, స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్, సైబర్, అంతరిక్ష, ప్రత్యేక బలగాల వంటి ట్రై-సర్వీస్ ఏజెన్సీల అధిపతిగా  ఉన్నారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీఓఏస్‌సీ)కి శాశ్వత ఛైర్మన్‌ కూడా ఆయనే. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ)కి సైనిక సలహాదారుడిగా బిపిన్ రావత్ అందించిన  సేవలు భారత సైన్యంలో చిరస్తాయిగా నిలిచి పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సైన్యంలో దుబారా ఖర్చును తగ్గించేందుకు తన శక్తిమేర కృషి చేసిన బిపిన్ రావత్ కు మనం ఏమివ్వగలం.?   యావత్ భారతావనికి అతి పెద్ద విషాద వార్త ఇది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: