హీరో కృష్ణ.. హీరోయిన్ రోజా మెడకు 'బోసడీకే' ఉచ్చు..!?

బోసడీకే.. ఈ పదం వారం రోజుల క్రితం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. టీడీపీ నేత పట్టాభి వాడిన ఈ పదం.. అనేక పరిణామాలకు దారి తీసింది. ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి కారణమైంది. అంతేనా.. చంద్రబాబు 36 గంటల నిరాహార దీక్షకు.. ఆ తర్వాత.. చంద్రబాబు ఢిల్లీ యాత్రకూ కారణమైంది. పట్టాభి సీఎంను పట్టుకుని బోసడీకే.. బోసడీకే.. బోసడీకే.. బోసడీకే.. అని ఏకంగా ఆరు సార్ల వరకూ అనడంతో  వైసీపీ కార్యకర్తలకు బీపీ పెరిగిపోయింది. అది టీడీపీ కార్యాలయాలపై దాడులకు దారి తీసింది.

అయితే.. ఈ బోసడీకే అన్న పదం గురించి ఆ తర్వాత ఎందరో ఎన్నో రకాల భాష్యాలు చెప్పారు. రఘురామకృష్ణంరాజు బోసడీకే అంటే అమాయకుడు అని అంటే.. పయ్యావుల కేశవ్ బోసడీకే అంటే బాగున్నారా అంటూ కొత్త అర్థం చెప్పారు. అయితే.. అవేమీ కాదు.. బోసడీకే అంటే లంజా కొడుకు అని ఏకంగా సీఎం జగనే అర్థం చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఇప్పుడు ఆ పదం ఒక్క పట్టాభి మాత్రమే కాదు.. చాలా మంది వాడారు లేవోయ్.. అంటూ సమర్థనకు బయలు దేరారు.. ఆంధ్రజ్యోతి ఆర్కే గారు.

ఆయన ఏమంటున్నారంటే.. ముఖ్యమంత్రినిగానీ మరొకరిని గానీ బోసడికే అని తిట్టడం ముమ్మాటికీ తప్పేనట.. ఈ విషయంలో పట్టాభి తప్పు చేసిన మాట నిజమేనట.. అదేంటబ్బా ఆర్కే అంత సులభంగా పట్టాభి తప్పును ఎలా ఒప్పుకున్నారా అని ఆశ్చర్యపోకండి.. అసలు కథ అక్కడే ఉంది. పట్టాభి తప్పు చేసినప్పటికీ.. తెలుగునాట కొన్ని పదాలను అర్థం తెలియకుండా వాడడం ఎప్పటి నుంచో జరుగుతోందంటూ వెనకేసుకొచ్చారు ఆర్కే.. అంటే పాపం.. పట్టాభి తప్పుడు మాట అన్నా.. అదేదో తెలియక అన్నాడులెండి అంటూ సమర్థిస్తున్నట్టుగా ఉంది ఆర్కే పద్దతి.

అంతే కాదు.. రౌడీ నెంబర్‌ వన్‌’ చిత్రంలో  హీరో కృష్ణ కూడా అప్పట్లో విలన్‌ను బోసడీకే అని తిట్టారట. వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొనే జబర్దస్త్‌ లో ఒక మహిళా పాత్రధారి మరొకరిని బోసడికే అని తిట్టిందట.. అది చూసి రోజా పగలబడి నవ్విందట. అంతే కాదట. సన్నిహిత మిత్రులు కూడా బోసడికే అని పిలుచుకుంటారట.. అబ్బా.. ఆర్కే గారూ.. పట్టాభిని సమర్థించడానికి మీరు ఎన్ని పాట్లు పడుతున్నారో..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: