షాకింగ్‌: ఒకేసారి సరిహద్దుల్లో వెనక్కి తగ్గిన ఇండియా, చైనా.. ఎందుకంటే?

కొంతకాలంగా ఇండియా, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే.. ఇలాంటి సమయంలో సరిహద్దుల్లో ఇండియా- చైనా దాదాపు ఒకే నిర్ణయం తీసుకున్నాయి. అదేంటో తెలుసా.. సరిహద్దుల్లోని సైనికులను దాదాపు 80 కిలోమీటర్లు వెనక్కు తీసుకొచ్చాయి. రెండు దేశాలు అదే పని చేస్తున్నాయి. ఇదంతా ఎందుకో తెలుసా.. ఇప్పుడు సరిహద్దుల్లో విపరీతమైన చలి పరిస్థితులు ఉన్నాయి. అవి ఏకంగా సైనికుల ప్రాణాలకే ప్రమాదకరంగా మారాయి.
అందుకే ఉద్రిక్తతల సంగతి పక్కన పెట్టి ముందు వారి ప్రాణాలు కాపాడాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అందుకే తమ సైనిక శిబిరాలను సరిహద్దుల నుంచి 60-80 కిలోమీటర్లు వెనక్కి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇండియా చైనా మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. చైనా ఇండియాలో ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం ఆక్రమించిందంటూ విమర్శలూ వచ్చాయి.  చైనా ఇండియాకు ఇప్పుడు చాలా ప్రమాదకరమైన, బలమైన శత్రువు. అయినా సరే భారత్ మాత్రం చైనా విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు.

లద్దాఖ్ ప్రాంతంలో మన భూభాగాల్లోకి చొచ్చుకు రావాలని ప్రయత్నించినా.. మన భౌగోళిక సరిహద్దులు మార్చాలని ప్రయత్నించినా ఎక్కడా రాజీపడకుండా తగిన బుద్ది చెబుతోంది. అందుకే ఇండియా- చైనా సరిహద్దుల్లో తరచూ సైనిక ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. భారత్‌ కూడా ఏమాత్రం తగ్గకుండా యుద్ధానికి సైతం సై అంటోంది.
ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తన సైనిక బలగాలకు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు కూడా. పోరాట నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకొని, అత్యున్నతస్థాయి అప్రమత్తతను కలిగి ఉండాలని.. ఏ క్షణాన యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిన్ పింగ్‌ ఆ సందేశంలో చెప్పారు. అయితే ప్రస్తుతం యుద్ధం సంగతి పక్కకు పెడితే రెండు దేశాలు సైనికుల ప్రాణాలు కాపాడాలని నిర్ణయించాయి.  అవును కదా.. యుద్ధం సంగతి తర్వాత.. సైనికుల ప్రాణాలు అమూల్యమైనవి కదా.. ఈ సున్నితమైన అంశాన్ని రెండు దేశాలు గుర్తించాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాయి. శభాష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: