ట్రైన్ లో వెళ్తుండగా ప్రసవం.. బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా?

praveen
సాధారణంగా పిల్లల విషయంలో ఇప్పటికి తల్లిదండ్రులు ఎంతోమంది కొన్ని సెంటిమెంట్లను గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా సెంటిమెంట్లను ఫాలో అవుతూ కొన్ని కొన్ని సార్లు పిల్లలకు వినూత్నమైన పేర్లు పెట్టడం చూస్తూ ఉంటాం. ఎక్కడికైనా గుడికి వెళ్లి వస్తున్నప్పుడు ప్రసవం జరిగింది. అంటే ఏకంగా ఆ దేవుడి మహిమతోనే ఇక తమకు పండంటి మగ బిడ్డ లేదంటే ఆడబిడ్డ పుట్టారు అని భావించి ఆ దేవుడు పేరు కలిసి వచ్చేలా ఇక ఆ చిన్నారికి పేరు పెట్టడం చూస్తూ ఉంటాం. ఇక మొన్నటి వరకు అయితే ఏకంగా బస్సులోకి ప్రయాణిస్తున్నప్పుడు ప్రస్తుతం  అయిన కారణంగా కొంతమంది విచిత్రమైన పేర్లు పెట్టడం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 అయితే కేవలం నిజజీవితంలోనే కాదు సినిమాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలను చూసి నవ్వుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి అని చెప్పాలి. ఏకంగా ఫ్లైట్ లో వెళుతున్నప్పుడు పుట్టింది అనే కారణంతో ఏకంగా విచిత్రమైన పేరును పెట్టడం చూస్తూ ఉంటాం. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఆ కుటుంబం మొత్తం ఏదో పనిమీద ట్రైన్లో ప్రయాణం సాధిస్తోంది. ఈ క్రమంలోనే మహాలక్ష్మి అనే ఎక్స్ ప్రెస్ ట్రైన్లో కుటుంబం ప్రయాణిస్తూ ఉండగా ఆ కుటుంబంలోని ఫాతిమా ఖాతూన్ అనే గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి.

 దీంతో ఏం చేయాలో అక్కడ ఉన్న రైల్వే అధికారులకు కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. చివరికి ఫాతిమా ఖాతున్ ఇలా కొల్హాపూర్ - ముంబై మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లోనే ఇక ఆడపిల్లకు జన్మనిచ్చింది. లోనావాలా స్టేషన్ దాటిన తర్వాత ఆ మహిళకు ప్రసవం జరిగింది. అయితే రైల్వే పోలీసులు సదరు మహిళలకు సహాయం అందించడంతో తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి పుట్టిందని కొలహపూర్ ఆలయానికి వెళ్లి వస్తున్న కొంతమంది చెప్పారు. అయితే మహాలక్ష్మి అనే ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఆ మహిళకు ప్రసవం కావడంతో చివరికి ఆ ట్రైన్ పేరునే ఆ పుట్టిన బిడ్డకు కూడా పెట్టారు ఆ కుటుంబ సభ్యులు. ఆ బిడ్డకు మహాలక్ష్మి అనే పేరు పెట్టినట్లు బాలిక తండ్రి తయ్యబ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: