కామాంధుల చేతిలో బలైన కూతురు.. ఆమె చితి వద్దే కుప్పకూలిన తండ్రి?

praveen
ఇటీవల కాలం లో ఎంతో మంది ఆడపిల్లలు కామాంధులు కోరల్లో చిక్కుకొని బలవుతున్న ఘటనలు చూసి రోజుకు వెలుగు లోకి వస్తున్నాయి. అయితే కామాంధులు అత్యాచారా లతో ఆగకుండా.. ఏకంగా ధారుణం గా ప్రాణాలు తీస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి. ఇటీవల రాజస్థాన్ లో వెలుగు లోకి వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. బిల్వారా జిల్లాలో ఓ బాలిక పశువులను మేపేందుకు బయటకు వెళ్ళగా సాయంత్రం అయిన ఇంటికి తిరిగి రాలేదు.


 ఈ క్రమంలోనే కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. కాగా స్థానికంగా ఉన్న ఒక ఇటుక బట్టి వద్ద కాలిపోయిన స్థితిలో ఆమె శరీర భాగాలు కనిపించాయ్. ఈ క్రమంలోనే సమీపంలో ఉన్న చెరువులో కూడా కొన్ని శరీర భాగాలు విసిరేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అని చెప్పాలి. అయితే మైనర్ బాలికను హత్య చేయడానికి ముందు ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నా.యి ఈ క్రమంలోనే ఇటీవలే సదరు బాలిక అవశేషాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయ్.


 అయితే అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలినంత పని అయింది. అప్పటికే కన్నబిడ్డ మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలిక తండ్రికి దహన సంస్కారాల సమయంలో దుఃఖం మరింత తనకొచ్చింది. గత వారం వరకు తనతో పాటే ఉన్న కుమార్తె అంతలోనే చితిమంటల్లో కాలిపోవడం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆ తండ్రి. వెంటనే అప్రమత్తమైన బంధువులు అతన్ని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. దిక్కులు పీక్కటిల్లేలా కూతురి మరణాన్ని తట్టుకోలేక ఆ తండ్రి చేస్తున్న రోదన  ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: