పాముకాటుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. చేసిన పనితో వైద్యులు పరుగోపరుగు?

praveen
సాధారణంగా వర్షాకాలం కావడంతో అటు విష సర్పాలు పొలాలలో ఎక్కువగా నక్కి ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పొలాల్లోకి వెళ్లే రైతులను కాటు వేయడం లాంటివి జరుగుతుంటాయి. ఇలా వర్షాకాలంలోనూ ఎక్కువ మంది రైతులు పాముకాటుకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒకప్పుడు ఇలా ఎవరైనా పాముకాటుకు గురైతే వెంటనే నాటు వైద్యం చేసే వారి దగ్గరికి పరుగులు పెట్టేవారు. కానీ ఇటీవలి కాలంలో అందరిలో అవగాహన పెరిగిపోయిన నేపథ్యంలో పాముకాటుకు గురి కాగానే వెంటనే ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు.
 ఇక్కడ  ఓ రైతు పొద్దునే ఎప్పటిలాగే పొలం చూడటానికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే పాము కాటుకు గురయ్యాడు  సదరు వ్యక్తి. అయితే ఇక ఎలాంటి అపోహలకు వెళ్లకుండా పాముకాటుకు గురైన వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు.  అయితే ఇలా ఆస్పత్రికి వెళ్ళడానికి ముందు  కాటు వేసిన పామును పట్టుకుని ఒక సంచిలో బంధించాడు. ఇక ఆసుపత్రికి వెళ్లిన తర్వాత సదరు వ్యక్తి చేసిన పనితో డాక్టర్లు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. బీహార్లోని షరీఫ్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. సురేంద్ర ప్రసాద్ అనే యువకుడు పాము కాటు తో వచ్చి ఆస్పత్రిలో చేరాడు.
 ఈ క్రమంలోనే అతని ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు కూడా వెంటనే చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇలా వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో  సమయంలో ఒక చెత్త పనిచేసాడు సదరు వ్యక్తి.  సంచి లో బంధించిన  కాటేసిన పామును ఒక్కసారిగా బయటకు తీసి చూపించాడు. వైద్యులందరూ భయపడిపోయి అక్కడి నుంచి పరుగో పరుగు అన్నారు. ఇక ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఆ పాముని మళ్ళీ సంచిలో వేసి బంధించాడు. ఇక ఎందుకు అలా చేసావు అని ప్రశ్నించగా.. ఏ పాము కాటు వేసింది అని వైద్యులు అడుగుతారు కదా చూపించడానికే తీసుకు వచ్చాను అంటూ షాకింగ్ సమాధానం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: