చిన్నపాటి నిర్లక్ష్యం.. చిన్నారిని చిదిమేసింది?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధం  గానే ఉంటుంది. అంత సంతోషం గా సాగిపోతుంది అనుకుంటున్న సమయం లో అనుకోని విధంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాల్లో విషాదం నుండి పోతూ ఉంటుంది. కొన్ని సార్లు ఇక ఇతరులు నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలు పోతుంటాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇంటి ముందు ఎంతో సంతోషంగా ఆడుకుంటున్న ఏడాది వయసున్న బాలిక అంతలోనే కారు ఢీకొనడం తో మృత్యుఒడి లోకి వెళ్ళింది.

 దీంతో అప్పటి వరకు చిరు నవ్వుతో తమ ముందే తిరిగిన కూతురు ఇక లేదు అన్న విషయాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించు కోలేక అరణ్య  రోదనగా విలపించారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో వెలుగు లోకి వచ్చింది అనేది తెలుస్తుంది. జింకల వాడ లో ఉండే అఖిల్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కొంతకాలం నుంచి ఇక్కడే కుటుంబం తో కలిసి నివాసముంటున్నాడు. అయితే అతడికి ఏడాదిన్నర వయస్సున్న కుమార్తె మోక్షిత ఉంది. ఇక ఇటీవలే మధ్యాహ్న సమయం లో ఇంటి ముందు ఆడుకుంటుంది.

 ఈక్రమం లోనే అటు వైపుగా వచ్చిన కారు అఖిల్ ఇంటి ముందు ఆగింది. ఇక ఆ తర్వాత కారులో నుంచి కొంత మంది యువకులు దిగారు. వెంటనే రసూల్ అనే యువకుడు డ్రైవింగ్ సీట్ లో కూర్చుని కారు నడపడం మొదలు పెట్టాడు. కానీ కారు ముందు ఉన్న పాపను గమనించలేదు. ఇక అతని నిర్లక్ష్యం కారణం గా చివరికి కార్ చిన్నారిని ఢీకొట్టడం తో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే తల్లి దండ్రులు నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి మరణానికి కారణమైన రసూల్ ను అదుపు లోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: