మూడేళ్ళ ఫ్రెండ్షిప్..చివరికి పెళ్ళి..షాక్ లో కుటుంబం..

Satvika
అమ్మాయిలు పెళ్ళి చేసుకోవడం కామన్.. ఈ మధ్య ఒకే లింగ మనుషులు పెళ్ళి చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు తప్పుగా భావించె వాళ్ళు ఇప్పుడు తప్పేముంది అని సమాధానం ఇస్తున్నారు. అందుకు కారణం కూడా లేక పోలేదు.. కోర్టు కూడా అలాంటివి చెల్లు తాయని గ్రీన్ ఇవ్వడం తో అందరూ అలాంటి వాటికి మొగ్గు చూపుతున్నారు.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మొన్నీమధ్య జరిగిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది...

ప్రేమ ఎప్పుడూ, ఎవరి మధ్య పుడుతుంది అనేది చెప్పడం చాలా కష్టం.. ప్రేమ అనేది ఎప్పుడూ ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్యే పుడుతుందా? అప్పుడప్పుడు ఇద్దరమ్మాయిల మధ్య లేదా ఇద్దరబ్బాయిల మధ్య కూడా ప్రేమభావం పుడుతుంటుంది.. వివరాలిలా.. భారత్‌ లో కూడా స్వలింగ వివాహాలు జరుగుతున్నాయి. రాజస్థాన్‌ కు చెందిన ఇద్దరమ్మాయి లు మూడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తాజాగా వారి ప్రేమకథ కోర్టుకు చేరుకుంది.

రాజస్థాన్‌లోని నాసిరాబాద్‌కు చెందిన ఇద్దరమ్మాయిల మధ్య మూడేళ్ల క్రితం స్నేహం చిగురించింది. ఆ తర్వాత అది ప్రేమ గా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా మారింది. పెద్దలు తమ పెళ్లికి ఎలాగూ అంగీకరించరనే కారణంతో వారు రెండున్నర నెలల క్రితం ఇళ్ల నుంచి పారిపోయారు.. ఇరు కుటుంబాల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం తో ఈ ఘటన వెలుగులొకి వచ్చింది.. ఎట్టకేలకు పోలీసులు వారిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు.

తామిద్దరం ఇప్పటికే వివాహం చేసుకున్నామ ని వారు కోర్టులో చెప్పారు. అందుకు సంబంధించిన పత్రాల ను కూడా చూపించారు. కాగా, ఆ వివాహాన్ని రద్దు చేసుకునే లా అమ్మాయిల కుటుంబాలు ఇద్దరినీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆ అమ్మాయిలు మాత్రం తాము జీవితాంతం కలిసే ఉంటామని తెగెసి చెప్పారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: