అగ్నిపథ్ నిరసన.. వృద్ధుడి ప్రాణం పోయింది?

praveen
త్రివిధ దళాల్లో కొత్త నియామకాల కోసం అటు కేంద్ర ప్రభుత్వం అగ్నిపత్ అనే పథకాన్ని తీసుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్మీలో చేరాలనుకుంటే అభ్యర్థులు అందరూ కూడా అగ్నిపత్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.  ఇలా అగ్నిపత్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఏకంగా హింసాకాండకు కారణమవుతున్నాయి.

 ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న అందరూ యువకులు కూడా అటు రైల్వేస్టేషన్ లకు చేరుకుని సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఏకంగా రైల్వే స్టేషన్ లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే కాదు రైళ్లను తగలబెట్టడం లాంటివి కూడా చేశారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైనా రైల్వే శాఖ రైళ్ల రాకపోకలను నిలిపి వేసింది అన్న విషయం తెలిసిందే.. ఇలా రైళ్ల రాకపోకలను నిలిపి వేయడంతో ఎంతో మంది సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ అగ్నిపత్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల కారణంగా రైలు నిలిచిపోవడంతో ఒక వృద్ధుడు గుండె ఆగిపోయింది.

 ఎంతో ఎమర్జెన్సీగా రైలులో ప్రయాణించాల్సిన వృద్ధుడు వెళ్లకపోవడంతో చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాకు చెందిన జోగేష్ బీహారా అనే 70 ఏళ్ల వృద్ధుడు గుండె సంబంధిత చికిత్స కోసం కోర్బా - విశాఖ రైల్లో విశాఖ కు వస్తున్నాడు. కాగా అగ్నిపత్ అల్లర్లలో భాగంగా ఆ రైలును విజయనగరం జిల్లా కొత్తవలస లో నిలిపివేశారు రైల్వే అధికారులు. ఆ వృద్ధుడికి మాత్రం  గుండె నొప్పి తీవ్రం కావడంతో కొత్తవలస లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సదరు వృద్ధుడు మృతి చెందాడు అని చెప్పాలి. ఈ ఘటనతో అటు కుటుంబం మొత్తం విషాదంలో మునిగి పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: