అయ్యో పాపం..మామ నోట్లో గుడ్డలు పెట్టి, కోడలి పై లైంగిక దాడి..

Satvika
మహిళలు తమ శీలాన్ని కాపాడు కోవడం కోసం నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది..పగలు, రాత్రి అని లేకుండా మహిళల పై దాడులు జరుగుతున్న ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఇప్పుడు జరిగిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.మత్తులో ఓ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. బయట నిద్రిస్తున్న వ్యక్తికి నోట్లో గుడ్డలు కుక్కి.. కాళ్లు, చేతులు కట్టి పడేసి ఇంట్లో నిద్రిస్తున్న ఆయన కోడలిపై అత్యాచారానికి ప్రయత్నించారు.ఆమె గట్టిగా కేకలు వేస్తూ బయటికి రావడంతో వారు పారిపోయారు.కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 
మహిళా, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... సోమవారం రాత్రి ఆ మహిళ తన భర్త, కుమార్తెతో ఇంట్లో నిద్రిస్తుంది. మామ ఇంటి బయట మంచంపై పడుకున్నాడు.రాత్రి 11 గంటల సమయంలో ఆమె భర్త బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన తలారి హనుమేష్, పాటప్ప, కృష్ణమూర్తి మద్యం మత్తులో ఆ ఇంట్లోకి చొరబడ్డారు. బయట పడుకున్న ఆమె మామ నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు, చేతులు కట్టేశారు. మహిళపై అత్యాచార యత్నం చేశారు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ.. వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. చుట్టుపక్కల వారు లేచి వచ్చేసరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయారు.

 
వెంటనే కుటుంబ సభ్యులు, భర్తతో కలిసి బాధితురాలు కోసిగి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఇకపోతే ఇలాంటి ఘటన ఒకటి రాజస్థాన్ లో వెలుగు చూసింది.రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు చెందిన అంకిత్ అనే వ్యక్తి తన ప్రాంతంలో నివసిస్తున్న15 ఏళ్ల యువతిపై కన్నేశారు. పై గదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కింద గదిలో పడుకున్న తండ్రికి పై గది నుంచి ఏవో శబ్దాలు రావడంతో నిద్రలేచాడు. ఏమైందోనని పైకి వెళుతుండగా కూతురు గది నుంచి ఓ యువకుడు పారిపోవడం గమనించారు. కూతురు గదిలోకి వెళ్లి గమనించగా ఏదో అనుమానం కలిగింది. కూతుర్ని ప్రశ్నించగా ఆమె జరిగిన విషయం తండ్రికి చెప్పింది. అది విని తండ్రి షాక్కు గురయ్యాడు. ఈ కేసు విచారణలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: