పేరుకేమో పోలీసు.. స్ట్రీట్ ఫైట్ చేస్తూ దొరికాడు..

Satvika
పోలీసులు అంటే ప్రజల మాన ప్రాణాలను కాపాడే వాళ్ళు..ఏదైనా కష్టం అని వెళితే దానికి పరిష్కారం చూపడం తో పాటు, వచ్చిన వారికి నేనున్నా అని భరొషా కల్పిస్తారు.. కానీ ఈ మధ్య ఖాకీ వేసుకున్న చాలా మంది కాసులకు అమ్ముడు పోయి న్యాయాన్ని అడ్డదారిలో అమ్మెస్తున్నారు.. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు స్ట్రీట్ రౌడీలుగా మారిపోతున్నారు. ఫుడ్,నిత్యావసర సరుకుల దుకాణాల పై పడి బెదిరిస్తున్నారు.న్యాయం అడిగితే అంతే బండ బూతులు తిట్టడం లేదా కొట్టడం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి నీచపు ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

 
అర్దరాత్రి బిర్యాని కోసం ఓ పోలీసు అధికారి ఓ హోటల్ కు వెళ్ళాడు. అక్కడ లేదని చెప్పడం ఆగ్రహం తో ఊగిపొయిన అతను నోటికి వచ్చిన మాటల తో దూసించాడు. కానీ అతను అంతటితో ఆగకుండా విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడి పై హోటల్ సిబ్బంది పై అధికారులకు ఫిర్యాధు చెయ్యడం తో అసలు విషయం బయటకు వచ్చింది. రౌడీయిజం శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. ఆ ఏఎస్సై పేరు ఉజైతుల్లా. పనిచేసేది నల్లమాడ పోలీస్ స్టేషన్‌. టైమ్‌ కాని టైమ్‌ లో అర్ధరాత్రి బిర్యానీ కోసం ఓ హోటల్‌కి వచ్చిన ఏఎస్సై ఉజైతుల్లా, అక్కడి సిబ్బంది పై వీరంగం ఆడాడు.


ప్రజలను పాలించే రూలర్‌లా ఫీలయ్యాడు. భోజనం అయిపోయిందని చెప్పినందున హోటల్‌ సిబ్బంది పై దాడికి దిగాడు. బండ బూతులు తిడుతూ బూటు కాలితో ఇష్టానుసారంగా తన్నాడు. నాకే లేదని చెప్తావా అంటూ సర్వర్‌పై బూతులు తిడుతూ విరుచుకుపడ్డాడు. ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఏఎస్సై ఉజైతుల్లా వీరంగంపై జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌కి కంప్లైంట్ చేశాడు బాధితుడు నాయుడు. బూతులు తిడుతూ తనపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఏఎస్సై పై చర్యలు తీసుకోవాలని కోరాడు.. దీనిపై స్పందించిన అధికారులు అతన్ని విచారణకు పిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: