చిన్నపాటి అత్యుత్సాహం.. 17 మందికి గాయాలు?

praveen
సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు కొంతమంది అత్యుత్సాహంతో చేసే పనులూ అనుకోని ప్రమాదాలకు దారి తీస్తుంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరహా ఘటనలు అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. సాధారణంగా మతపరమైన సమావేశాలు రాజకీయ సమావేశాలు జరిగినప్పుడు అక్కడికి జనాలు గుంపులుగా తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చే జనాల పట్ల ఒక అంచనా వేసే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంటారు నిర్వాహకులు.

 కానీ కొన్ని కొన్ని సార్లు ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు మాత్రం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి తరహా ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. సాగర్ జిల్లాలో ఒక కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. బినా పట్టణంలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమాల్లో దాదాపు 25,000 మంది భక్తులు హాజరయ్యారు. కాసేపు వరకూ ఎంతో సజావుగా సాగింది కార్యక్రమం. కానీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి తమ వారిని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు.

 ఈ క్రమంలోనే బారికేడ్లను  సైతం దాటుకుంటూ వచ్చేశారు. దీంతో తోపులాట జరగడంతో ఒకరిని చూసి మరొకరు ముందుకు రావడంతో గందరగోళం నెలకొంది. చూస్తూ చూస్తుండగానే అందరూ కలిసి కూర్చున్న వారిపై పడ్డారు. ఇలా తోపులాటలో భక్తులను కంట్రోల్ చేయలేకపోయారు నిర్వాహకులు. అదే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎంతోమంది కుప్పకూలిపోయారు. ఇలా ఎంతోమంది ఆర్తనాదాలతో అక్కడ గందరగోళం నెలకొంది. సుమారుగా 17మందికి గాయాలయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 
ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే అటు పోలీసులు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ను కంట్రోల్ చేసే విధంగా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: