జైల్లో స్నేహం..బయట చోరి..చివరి మజిలీ అక్కడికే..

Satvika
దొంగలకు ఈజిగా స్నేహం కుదురుతుంది.. ఆ విషయంలో నో డౌట్..డబ్బులు ఈజిగా సంపాదించాలి అనుకుంటే మాత్రం పార్ట్నర్ వుండాలని అంటున్నారు.అలా ఓ ముగ్గురూ దొంగలకు జైల్లో మంచి స్నేహం కుదిరింది.చోరీల ద్వారా కాజేసిన బంగారు నగలు, వెండి వస్తువులతో ఎప్పటికైనా కర్ణాటక రాష్ట్రంలో ఓ జ్యూయలరీ షాపు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నదే తడవుగా జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వరుస చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 25 చోరీల్లో దోచుకున్న సొత్తుతో కారులో కర్ణాటకకు చెక్కెసారు.


ఆ సమయంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కారు.వారి దగ్గర నుంచి కోటి రుపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.అమలాపురం పోలీసులు ఈ దొంగల జాతకాన్ని మీడియా ముందు బయట పెట్టారు.వీరు దోచుకున్న బంగారు నగలు, వెండి వస్తువులు, బంగారం కరిగించే పరికరాలు జ్యూయలరీ షాపును తలపించింది.2016 లో జైలుకు వెళ్ళిన వీళ్ళు మంచి స్నేహితులు అయ్యారు.దీంతో వారి స్నేహం మరింత బలపడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ముగ్గురూ కలిసి చోరీలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రామచంద్రపురం, అమలాపురం పోలీసు డివిజన్ల పరిధిలో 25 చోరీలు చేసి రూ.కోటి విలువైన సొత్తు పోగు చేశారు.


చోరీల్లో దోచుకున్న 1,360 గ్రాముల బంగారు నగలు, 30 కిలోల వెండి వస్తువులు, రూ.40 వేలు నగదు, బంగారం కరిగించే పరికరాలు, కట్టర్లు, రాడ్లు తదితర సామగ్రితో ఓ కారులో సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రానికి ఆ ముగ్గురూ బయలుదేరారు. అక్కడ జ్యూయలరీ షాపు పెట్టాలన్నది వారి లక్ష్యం. వారి కారు అంగర పోలీసు స్టేషన్‌ పరిధిలోని టేకి గ్రామ శివారుకు వచ్చేసరికి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ క్రమంలో వీరి పై అనుమానం కలిగింది.దాంతో చెక్ చేశారు.తప్పు నెంబర్ కావడం లోపల చూసి షాక్ అయ్యారు.వారిని అదుపులోకి తీసుకొని విచారించిగా అసలు విషయం బయటకు వచ్చింది. ఎక్కడెక్కడ చొరిలు చేశారు అనే విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: