వామ్మో.. పట్టపగలు దొంగలు ఎలా రెచ్చిపోయారో చూడండి?

praveen
ఇటీవలి కాలంలో దొంగలు  ఎక్కడ చూసినా రెచ్చిపోతున్నారు అన్న విషయం తెలిసిందే.. కాస్త అజాగ్రత్తగా ఉంటే చాలు అందినకాడికి దోచుకో పోతూ ఉన్నారు.  ఈ క్రమంలోనే ఇలా ఇటీవల కాలంలో  వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతిక్షణం ఎవ్వరిని నమ్మకుండా ప్రతి క్షణం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బ్యాంకుల వద్ద దొంగతనాలు చేస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే.

 బ్యాంకులో డబ్బులు విత్ డ్రా చేసుకునే వారిని గమనించడం..  వారిని ఫాలో అవ్వటం సమయం చూసి డబ్బులు దొంగలించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవలే మధ్యప్రదేశ్లోని దామోలో కూడా ఇలాంటి ఓ ఘటన జరిగింది. సద్గువా గ్రామానికి చెందిన పటేల్ జి అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవలే బ్యాంకు నుంచి లక్ష రూపాయల నగదు విత్ డ్రా చేశాడు. మూడు రోడ్ల కూడలి దగ్గర ఉన్న పండ్ల దుకాణంలో మామిడిపండ్లు కొనుక్కుందామని అనుకున్నాడు. అయితే ఈ సమయంలోనే కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాడు. డబ్బులు ఉన్న బ్యాగ్ ని తన బైక్ పై పెట్టి పండ్ల వ్యాపారి తో బేరం ఆడటం  మొదలు పెట్టాడు.

 ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఇక బైక్ పై ఉన్న డబ్బులు తీసుకుని ఆ తర్వాత పక్కనే వచ్చిన మరో బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. డబ్బులు సంచి తీసుకుని పారిపోతున్న దొంగలను చూసి రైతు పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా రోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తుండగానే బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు డబ్బుల బ్యాగ్ ఎత్తుకెళ్లిన దృశ్యాలు ఒక సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇక ఈ వీడియోలు క్లాస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: