పెళ్లి అప్పు తీర్చడం కోసం.. ఐపియల్ బెట్టింగ్ పెట్టిన మహిళ.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో బెట్టింగ్ మాఫియా ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు అటు బెట్టింగ్ చేసే వారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరిగి పోతూనే ఉంది అని చెప్పాలి. అయితే బెట్టింగ్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎంతలా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినప్పటికీ ఈ బెట్టింగులు మాత్రం అస్సలు ఆగడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ నేపద్యంలో ఈ బెట్టింగ్ మాఫియా మరింత రెచ్చిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం మూడు గంటల వ్యవధిలోనే భారీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో యువత ఇక ఈ బెట్టింగ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. చివరికి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

 ఇక ఇటీవలే ఒడిషాలో బెట్టింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చాలి అని ఆశతో ఐపియల్ లో బెట్టింగ్ పెట్టడం మొదలు పెట్టింది సదరు మహిళ. కానీ డబ్బులు రావడం కాదు కదా చేతిలో ఉన్న డబ్బులు కూడా పూర్తిగా పోయాయి. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఒడిశాలోని రాయగడ్ జిల్లాలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల క్రితం కూతురు పెళ్లి కోసం సదరు మహిళ అప్పు చేసింది. అయితే అప్పు ఇచ్చిన వారు డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి తీసుకు వస్తున్న నేపథ్యంలో 22 ఏళ్ళ కొడుకుతో కలిసి ఐపీఎల్  లో డబ్బులు సంపాదించాలని ఆశ పడింది.

 ఇలా బెట్టింగ్ పెట్టడం కోసం మరోసారి అప్పు చేసింది.  కానీ బెట్టింగ్ లో  మాత్రం వారికి అదృష్టం కలిసి రాలేదు. దీంతో మొత్తం పోగొట్టుకున్నారు. ఇక మరో వైపు నుంచి అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇటీవలే తల్లీ కొడుకులు ఇద్దరూ కలిసి ఆహారంలో విషం కలుపుకొని తిన్నారు.  స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కుమారుడు చనిపోగా కొన్ని గంటల వ్యవధిలోనే తల్లి కూడా మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: