వదిన పై పగ పెంచుకున్న మరిది..చివరికి..
తన వదినను బ్రతకనివ్వకూడదని అనుకున్నాడు. అందుకు అతను వేసుకున్న ప్లాను ప్రకారం ఆమెను అతి దారుణంగా చంపాడు.చివరికి ఊసలు లెక్కబెడుతున్నాడు. వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది.బర్వానీ జిల్లాలో పాటి పోలీస్ స్టేషన్ పరిధిలో జస్మా బాయి అనే మహిళ సోమవారం హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.. అక్కడ పరిస్థితుల వల్ల హత్య చెసారని తెలుసుకొని కేసు నమోదు చేసి,విచారణ వేగవంతం చేశారు.
ఈ ఘటన పై కుటుంబ సభ్యులను, చుట్టూ పక్కలవారిని అడిగి తెలుసుకున్నారు.జస్మా బాయి, ఆమె మరిది భుర్లా మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. భూర్లా గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే భార్యలు ఇద్దరూ అతన్ని విడిచి వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లారు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. భార్యలు ఇద్దరు తనను వదిలేయడం వెనుక వదిన ఉందని భుర్లా అనుమానించి ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం ఎదురు చూసి, ఇంట్లోకి ప్రవేశించి ఆమెను దారుణంగా హత్య చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరచారు.