ప్రేమ పేరుతో నమ్మించి దారుణంగా మోసాలు చెస్తున్నారు. ప్రెమించి కొద్ది రోజులు యువతికి నమ్మకాన్ని కలిగిస్తారు. అలా కొద్ది రోజులు బాగానే ఉంటారు. ప్రేమంటే ఇదేరా.. అనే రెంజులో వారి కోరికలను తీర్చి కున్నాక మొహం ఛాటేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా చెన్నై లో వెలుగుచూసింది.. గతంలో కూడా చాలా ఘటనలు తమిళనాడులో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అని చెప్పాలి.. ఇప్పుడు కూడా మరో ఘటన వెలుగు చూసింది.
ప్రేమ పేరుతో వంచనకు గురైన యువతి ప్రియుడి ఇంటి ముందు ఆత్మహత్యకు యత్నించింది.. ఇది భాదాకరమైన విషయం అనే చెప్పాలి.వివరాల్లొకి వెళితే..చెన్నై లోని తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలో శుక్రవారం జరిగింది.. చెన్నై లోని ప్రముఖ బ్యాంక్ లో యువతి పని చెస్తుంది.. ఈమె రోజూ బ్యాంక్ కు వెళ్ళే క్రమంలో అద్దె కారులో వెళ్ళేది. రొజూ అలానే ఇంటికి వస్తూ, వెళ్ళేది. ఈ నేపథ్యంలో కారు డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులు బాగానే ఉన్నారు. మంచి స్నెహితులు అనే భావనతో ఉండేవారు..
అది కాస్త కొద్ది రోజులకు ప్రేమగా మారింది.ఇద్దరూ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై లైంగిదాడి చేశాడు. వివాహం చేసుకోవాలని యువతి పట్టుబట్టడంతో రామన్ ఎవరికీ తెలియకుండా సొంతూరుకు చేరుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న యువతి మొసపొయానని తెలుసుకొని వెంటనే ప్రియుడి ఇంటి వద్దకు చేరుకుంది. అతణ్ణి కోసం వెళ్ళి పెళ్ళి చేసుకోవాలని కోరింది. అందుకు తాను నిరాకరించాడు. కేవలం ఎంజాయ్ చెసాము అని ఏవేవో మాటలు చెప్పాడు.ఇంటి ముందే నిరసన తెలిపింది. 9 రోజులైనా పట్టించుకోక పోవడంతో శుక్రవారం శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు..విషయం తెలుసుకున్న పోలీసులు అక్క డకు చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు..