అత్త సూటిపోటి మాటలు.. అల్లుడు చేసిన పనికి షాక్?
ఇలా ఇటీవలి కాలం లో భార్య బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతూనే ఉంది. అయితే భార్య బాధితుల సంఘం ఏర్పాటు చేయాలి అంటూ మీమ్స్ లో చూసినప్పుడు అందరూ నవ్వుకుంటారు కానీ.. నిజం గా భార్య అత్తమామల కారణం గా వేధింపులకు గురవుతున్న ఎంతో మంది భర్త ఆత్మహత్య చేసుకుంటూ ఉండడం తో అందరూ షాక్ అవుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది.
అత్త వేధింపులు తాళలేక పోయినా అల్లుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సూటిపోటి మాటలతో అత్త వేధిస్తూ ఉండడంతో ఎంతగానో మనస్థాపం చెంది చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. మహమ్మద్ రఫీక్ నాదాఫ్ అనే వ్యక్తి భార్య అసామ తో కలిసి గ్రామం లో ఉంటున్నాడు. ఇక ఎదురు ఇంట్లోనే అత్త సాహెబ నివాసముంటుంది. కాగా అత్త తో పాటు పక్కింట్లో ఉంటున్న మరికొంతమంది మహిళలు కూడా మహ్మద్ రఫీక్ నాదాఫ్ ను సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపం చెందిన సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.