ఎయిర్ హోస్టెస్ ని లైన్ లో పెట్టాడు... చివరికి ఏమైందంటే?

praveen
సాధారణంగా విమాన ప్రయాణాలు అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నవి విషయం తెలిసిందే. అందుకే కేవలం ధనికులు మాత్రమే విమాన ప్రయాణాలు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. ఇక సామాన్య ప్రజలు విమాన ప్రయాణం చేయాలి అని కలలు కనడం తప్ప వాటిని నిజం చేసుకోవడం చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో సామాన్యులకు విమానం ఎక్కాలనే కలను తీర్చేందుకు వివిధ విమానయాన సంస్థలు తక్కువ ధరలకే టికెట్లను అందుబాటులో ఉంచుతూ ఉండటం గమనార్హం. దీంతో ఎంతో మంది సామాన్యులు సైతం ఇక దీన్ని సద్వినియోగం చేసుకుంటూ విమానం ఎక్కాలానే కలను నెరవేర్చుకున్నారు.

 అయితే లోకల్ ప్రయాణాలకు అయితే ఓకే గాని జాతీయ అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలంటే మాత్రం సామాన్యులకు చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పాలి. అలాంటిది విమానంలో బిజినెస్ క్లాస్ లో ప్రయాణించడం అంటే ఇక ఖర్చు ఎంత రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం అవి లెక్క చేయలేదు. విమానం ఎక్కాడో లేదో మొదటిసారి అందులో పనిచేస్తున్న ఎయిర్హోస్టెస్ ను చూడగానే లవ్ లో పడిపోయాడు. సినిమాల్లో చూస్తుంటాం కదా.. హీరోయిన్ లను లవ్ లో దింపడానికి హీరోలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక యువకుడు కూడా ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

 ఎలాగైనా ఎయిర్హోస్టెస్ నీ ప్రేమలో కి దింపాలి అని అనుకున్నాడు. ఇక దీని కోసం తనకు వచ్చిన ప్రతి ఆలోచనను అమలులో పెట్టాడు. ఖర్చుకు కూడా వెనకాడలేదు. ఈ క్రమంలోనే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి బిజినెస్ క్లాస్ లో విమానంలో తరచూ ప్రయాణించడం  మొదలుపెట్టాడు.. ఇక ఎయిర్హోస్టెస్ ని ఇంప్రెస్ చేయడం కోసం వెస్ట్ బెంగాల్ కు చెందిన లిక్కర్ స్మగ్లర్ సమర్ ఘోష్ లక్షల రూపాయలు ఖర్చుపెట్టి సిలిగురి- ఢిల్లీ మధ్య ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 సార్లు విమాన ప్రయాణం చేశాడు. ఇక అనుకున్నట్లుగానే ఎయిర్ హోస్టెస్ ని లవ్ లో పడేశాడు. చివరికి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇటీవలే లిక్కర్ స్మగ్లర్ కాస్త పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఆ తర్వాత పోలీసు విచారణలో భాగంగా ఈ విషయాలన్ని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: