సికింద్రాబాద్‌ క్లబ్‌ అగ్నిప్రమాదానికి కారణాలు ఇవే ?

Veldandi Saikiran
సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  ఇవాళ తెల్లవారు ఝామున ఈ ఘటన జరిగింది.  షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారుజామున 3 గంటలకు ఘటన చోటు చేసుకుంది.  పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడడంతో క్లబ్ పూర్తిగా దగ్ధమైన ట్లు సమాచారం అందుతోంది. దీంతో కోట్లలో  నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతుందది.   బ్రిటిష్ కాలంలో నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్  18వ శతాబ్దంలో నిర్మించిన  ఈ సికింద్రాబాద్ క్లబ్ అగ్ని ప్రమాదానికి గురి కావడం గమనార్హం. అయితే.. ఈ ప్రమాదంపై సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్  రఘురామి రెడ్డి  కీలక వ్యాక్యలు చేశారు.  సికింద్రాబాద్ క్లబ్ లో తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని.. షాక్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగినట్లు అనుమాణిస్తున్నామన్నారు.  క్లబ్ ముందు భాగం మొత్తం కూడా కలప , చెక్క తో కూడి ఉంది కాబట్టి ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందన్నారు.  ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది ఇప్పుడే అంచనాకు రాలేమన్నారు. 

ప్రయివేటు క్లబ్ కాబట్టే ఎవరిని లోపలకి అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు.  ఎన్నో ఏళ్లుగా ఈ క్లబ్ తో అనుబంధం ఉందని.. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశాయని పేర్కొన్నారు.   హెరిటేజ్ బిల్డింగ్ తో పాటు బార్ మొత్తం ప్రమాదంలో కాలిపోయిందని,, సుమారు మూడు గంటలు సమయం పట్టిందని చెప్పారు.  ఇందులో 24 ఎకరాల్లో క్లబ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని.. ఈ క్లబ్ లో నాలుగు వేలు మందికి సభ్యత్వం ఉందని వెల్లడించారు.   ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని... మరి కొద్ది సేపటిలో ఆర్కిటెక్చర్ , సివిల్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ చేరుకొని  ఎంత మొత్తంలో ఆస్తి నష్టం జరిగిందో అంచనా వేస్తారన్నారు.  ఇప్పటికే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయని సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్  రఘురామి రెడ్డి   ప్రకటన చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: