ప్రాణం తీసిన కోడి పందెం.. పండగపూట విషాదం?

praveen
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా పండుగ శోభ కనిపిస్తుంది. ఇక గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా రంగురంగుల రంగవల్లులు గొబ్బెమ్మలు హరిదాసులకీర్తనలు కనిపిస్తూ ఉంటాయి. సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది కోళ్ల పందాలు. తెలంగాణ రాష్ట్రంలో కోళ్ల పందాలు జరగవు. కానీ అటు ఆంధ్రా లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోళ్ల పందాలు జరుగుతూ ఉంటాయి. దీంతో ఈ కోళ్ల పందాలను చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు తరలి వస్తూ ఉంటారు.

 కోళ్ల పందాలను కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు బడాబడా ప్రముఖులు సైతం పాల్గొంటారు అన్నది ఎన్నో రోజుల నుంచి అందరికీ తెలిసిన మాట. ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు వీటిని చూడటానికి తరలి వెళ్తున్నారు. భీమవరం, వెంప, దెందులూరు, తణుకు, అమలాపురం, రావులపాలెంలో కోళ్ల పందాలు షురూ అయిపోయాయి. ఇక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కోళ్ల పందేలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

 అయితే అటు పోలీసులు కోళ్ల పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇక ఇలా కోళ్ల పందాలు నిర్వహిస్తున్న వారికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కోళ్ల పందాల లో కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా ఉంటే కోళ్ల పందాలు ఇటీవల ఒక యువకుడు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఇటీవలే గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కి చెందిన వీర్రాజు కోళ్ల పందాలు లో పాల్గొన్నాడు. మూడు సార్లు  ఓడిపోయాడు వీర్రాజు. దీంతో ఇక భారీగా డబ్బులు కోల్పోయాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బాధతో చివరికి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా  మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: