దారుణం: 13 ఏళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం..!!

N.ANJI
అభం శుభం తెలియని చిన్నారిపై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుజాత లా పబ్లిషింగ్‌ హౌస్‌ రచయిత అయిన గాదె వీరారెడ్డి (72) బర్కత్‌పురలోని గోకుల్‌ధామ్‌ అపార్ట్‌మెంట్స్‌లో జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంట్లో బాధితురాలి తల్లి పని మనిషిగా పని చేస్తుంది. అయితే 2017లో ఆమెను బడంగ్‌పేటలోని తన ఓపెన్‌ ప్లాట్‌కు వాచ్‌మెన్‌గా నియమించాడు.
అయితే బాధితురాలి తల్లి, ఆమె మేనమామ ఇద్దరు కలిసి మీర్‌పేట పీఎస్‌ పరిధిలో ఓ ఇంటిని కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. ఇక బాధితురాలి తల్లి ఇంటి పనులు మానేసి జీవనోపాధి కోసం టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ తరుణంలో వీరారెడ్డి తన న్యాయ పుస్తకాలను భద్రపరిచేందుకు సంచులు కావాలన్న నెపంతో తరచూ చిన్నారి ఇంటికి వెళ్ళేవాడు. ఇక గతేడాది డిసెంబర్‌లో బాధితురాలి తల్లి కుమార్తెను ఇంట్లో వదిలి సొంతూరికి వెళ్ళిపోయింది.
ఇక ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న వీరారెడ్డి అక్రమంగా చొరబడి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిచునట్లు తల్లి చెప్పడంతో ఆమె మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితుడు వీరారెడ్డి కేసు ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో మీ పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలి తల్లిని బెదిరింపులకు గురి చేశాడు. అంతేకాదు.. తనను వేధిస్తున్నారని పేర్కొంటూ నాన్‌ జ్యూడీషియల్‌ స్టాంప్‌ పేపర్లపై వివరాలు రాసి బాధితురాలి తల్లి, ఆమె మేనమామకు వాట్సాప్‌ ద్వారా మెసేజ్ పెట్టాడు.
కాగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు పంపించారు. కాగా.. నిందితుడి నుంచి రెండు నాన్‌ జ్యూడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు, స్కూటర్, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. సమాజంలో మంచి పలుకుబడి ఉన్న రచయిత ఇలా చేయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: