సెక్స్ రాకెట్ ఆగడాలు.. మరీ ఇలానా..!

Podili Ravindranath
కేరళలో సెక్స్ రాకెట్ ఆగడాలు పరాకాష్టకు చేరుకున్నాయి. సెక్స్ రాకెట్ ముఠాల బరితెగింపునకు అడ్డే లేకుండా పోయింది. సుఖం కోసం ఏకంగా భార్యలనే  మార్చుకోవడం కలకలం సృష్టిస్తోంది. లైంగిక సుఖం కోసం అడ్డదారులు తొక్కేందుకు సిద్ధపడుతున్నారు కొంతమంది. సభ్య సమాజం తలదించుకునేలా భార్యలను మార్చుకోవడం ఇప్పుడు విస్మయానికి గురిచేస్తోంది. కేరళలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇదేం పాడు బుద్ది అని కూడా అనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ లో దాదాపు వెయ్యి జంటల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇతర పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ తాళి కట్టిన భార్యను బలవంతం చేశాడు ఓ భర్త. దీనికి ససేమిరా అన్న భార్య... భర్తతో గొడవపడి అతనిపై పై కొట్టాయం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో కొద్దిరోజుల్లోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఇంతకు కేరళలో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. సోషల్ మీడియా, సోషల్ నెట్ వర్క్, యాప్, షేర్ చాట్ సహాయంతో తమ భార్యల్ని సెక్స్ కోసం వ్యాపారంలోకి దింపింది ఇదే బృందం. కేరళ వ్యాప్తంగా కార్యకలాపాల నిర్వహణకు తమ భార్యలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఉపయోగించుకున్నారు ఈ మగ మహారాజులు.  
లేటెస్ట్ గా భార్యలను మార్పిడి చేసుకున్న వారు టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపులలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఇలా సోషల్ నెట్వర్క్ వేదికగా ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతారు. ఈ రాకెట్ లో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వ్యక్తులు.. రాష్ట్రంలోని మూడు జిల్లాలకు చెందిన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకుని రాష్ట్ర వ్యాప్తంగా తమ చీకటి వ్యాపారాన్ని విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. సమాజంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులు కూడా ప్రస్తుతం ఈ సోషల్ మీడియా గ్రూప్ లో సభ్యులుగా ఉన్నట్టు తెలుస్తోంది. లైంగిక సంబంధాల కోసం ఆశ పడుతున్న వారి నుంచి భారీగా డబ్బులు అసలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అసలు సూత్రధారులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: