మహిళలు ఫర్ సేల్.. ఆన్ లైన్లో ఈ మహిళల వేలం పాట..!

MOHAN BABU
జనవరి 1 ఉదయం లేవగానే షాకింగ్ న్యూస్.. బుల్లి డీల్ ఆఫ్ ది డే అంటూ వందలాది ముస్లిం మహిళల ఫోటోలు వేల వేసినట్లుగా నోటిఫికేషన్స్. ఆ లిస్టులో తమను చూసుకున్న మహిళలు కంగారు పడిపోయారు. గతంలో జరిగిన ఇలాంటి సంఘటన నుంచి తేరుకోకముందే,మరోసారి ఈ వార్త భారతదేశాన్ని షాకింగ్ కు గురి చేసింది. ఈ మేరకు ముస్లిం మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యమైన, అశ్లీలమైన ఫోటోలతో పాటు అత్యంత హీనమైన పదజాలంతో కూడిన పోస్టులు సోషల్ మీడియా తో పాటు ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి. పరువు పోగొట్టుకొని అవమానభారంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు, భవిష్యత్తులో ఇంకోసారి మరే ఆడపిల్లకు ఇలాంటి గతి పట్టకూడదు అంటూ వారికి విన్నవించారు.ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.కానీ కేసు ఎంతవరకు నిలబడుతుంది?

 విచారణ ఎప్పటి వరకు సాగుతుంది? అనేది అసలు ట్విస్టు.అంతేకాదు బాధితులంతా కూడా ముస్లిం మహిళలే కావడంతో ప్రభుత్వం వారిపై వివక్ష చూపే అవకాశం ఉందని, కేసు తప్పుదారి పడుతుందని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ముస్లిం మహిళలను వేలం వేయడం ఇదే మొదటిసారి కాదు.లిబరల్ డోగే అనే యూట్యూబ్ ఛానల్ లో పాకిస్తాని మహిళలను వేలం వేస్తూ మూడేళ్ల క్రితం వీడియోలు రిలీజ్ చేసింది. దీన్ని భారతీయ ముస్లిం స్త్రీలు ఖండించడంతో, వాళ్లను కూడా టార్గెట్ చేశారు. అయితే ఇండియాలో ఇటీవలే సుల్లి డీల్స్ అనే యాప్ ఈ తరహా వేలానికి పూనుకుంది. ముస్లిం మహిళలను అమ్మేస్తున్నాం. మీకు ఎలాంటి కేపబిలిటీస్ కావాలి? ఎలాంటి వారితో పడుకోవాలని అనుకుంటున్నారు అంటూ యాడ్స్ ఇచ్చింది. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు ఈ యాప్ పై చర్యలు తీసుకొని క్లోజ్ చేయించారు. దీంతో నిర్వాహకులు ఈసారి ఆడియో ప్లాట్ ఫామ్ యాప్ క్లబ్ హౌస్ వేదికగా వేలం మొదలు పెట్టి ఆ తర్వాత మళ్ళీ బుల్లి బాయ్ యాప్ ను తెరమీదకు తీసుకొచ్చారు. అయితే బుల్లి బాయ్ యాప్ బాధితులంతా కూడా తమ స్వతంత్ర హక్కుల కోసం పోరాడిన యువతలవే కావడం గమనార్హం. ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకు, వాళ్ళ నోర్లు నొక్కేసేందుకు ఈ చర్యలకు పాల్పడ్డారు.

లింగ సమాన, స్త్రీ స్వతంత్ర సమాజం కోసం కాంక్షించిన ఆ గొంతుకలు మూగబోవద్దంటూ నెటిజన్లు, మహిళలు కామెంట్ చేస్తున్నారు.ఇంతటి దుర్మార్గపు పనికి ఒడిగట్టింది ఎవరు.. అంటే అభం శుభం తెలియని పేదరికంలో మగ్గుతున్న 20 ఏళ్ల పిల్లలు అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది.కానీ బాల్యం,పేదరికాన్ని పరిగణలోకి తీసుకొని వారిని వదిలేస్తే, రేపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాదనే గ్యారెంటీ లేదు కదా అంటున్నారు మేధావులు.ఏది ఏమైనా ఆడపిల్లల్ని బలిచేసిన ఈ వేలం పాట భారత జాతిలో చిచ్చుపెట్టే భవిష్యత్తు అస్త్రంగా మారబోతోందని మాత్రం నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: